ఆంధ్రా ఊటీకి పోటెత్తుతున్నారు పర్యాటకులు. సీజన్ పీక్‌కు చేరడంతో వంజంగి హిల్స్‌లో సూర్యోదయం సందర్శకులను కట్టిపడేస్తోంది. పచ్చని కొండల మధ్య తేలియాడుతూ ఆకట్టుకుంటోంది. తాజాగా అరకు వెళ్లాలనుకునే పర్యాటకులకు తూర్పు కోస్తా రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అదెంటో తెల్సా…మన్యంలో ప్రకృతి పరవశిస్తోంది. అరకు అందాలు కనువిందు చేస్తున్నాయి. వెండిమబ్బులు గాల్లో తేలుతున్న అక్కడి ఆహ్లాదకర వాతావరణం, అందమైన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అరకు లోయతో పాటు లంబసింగి, వంజంగిలోని ఈ మేఘాల కొండలు మైమరిపిస్తున్నాయి. ఆకాశమే దిగివచ్చిందా అన్నట్లు ఈ అద్భుత దృశ్యాలు …
Read More »