Tag Archives: bandi sanjay

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన సిట్ ?

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం ఆయనకు పోన్‌ చేసిన సిట్‌ అధికారులు.. గత బీఆర్ఎస్ హాయాంలో మీ ఫోన్‌ కూడా ట్యాప్‌ అయ్యిందని..ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి వాంగ్మూలం తీసుకునేందుకు …

Read More »

రజాకార్ సినిమాను తప్పకుండా చూడాలన్న బండి సంజయ్.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

తెలంగాణ చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం రజాకార్. యాటా సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమాలో అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, బాబీ సింహా, వేదిక‌, ప్రేమ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్‌, తేజ్ స‌ప్రు, జాన్ విజ‌య్‌, దేవీ ప్ర‌సాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.తెలంగాణ సాయిధ పోరాటంలో అమ‌రులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం రజాకార్. అప్పటి ర‌జాక‌ర్ల దురాగ‌తాలను అణచివేసి హైద‌రాబాద్‌ను ఇండియాలో విలీనం చేసేందుకు ప‌టేల్ చేసిన ప్ర‌య‌త్నాలను ఈ మూవీలో చూపించారు. గతేడాది మార్చి 15న థియేటర్లలో …

Read More »

అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. పోలీసుల తీరుపై ఆగ్రహం

సినీ నటుడు అల్లు అర్జున్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో భాగంగా చిక్కడ పల్లి పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇది అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు అందరినీ షాక్ కు గురిచేసింది. ముఖ్యంగా బన్నీ అరెస్ట్ పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ …

Read More »

నేను కూడా పంపిస్తా.. కాచుకో.. కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్ స్పందన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపించిన నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ తనకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశానని తెలిపిన బండి సంజయ్.. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తనపై మొదట కేటీఆరే వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించినట్టు పేర్కొన్నారు సంజయ్. అందుకు బదులుగానే తాను మాట్లాడినట్టు తెలిపారు. “కేటీఆర్ సుద్దపూస అనుకుంటున్నాడేమో. ఆయన భాగోతం ప్రజలకు …

Read More »

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అరెస్ట్.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తం..!

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. హైదరాబాద్‌లోని అటు అశోక్ నగర్‌లో, ఇటు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు యువత నుంచే కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీల నేతల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. గ్రూప్-1 అభ్యర్థులకు అండగా.. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే.. కేంద్రం మంత్రి బండి సంజయ్ కూడా గ్రూప్-1 అభ్యర్థులకు అండగా నిలిచారు. అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలో బండి సంజయ్ …

Read More »

తిరుపతి లడ్డూ వివాదంపై బండి సంజయ్ ఘాటు స్పందన.. చంద్రబాబుకు స్పెషల్ రిక్వెస్ట్

దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదమైన లడ్డూకు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే.. ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూపై నిన్న(సెప్టెంబర్ 18న) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందువుల్లో ఆందోళన రేకెత్తించటంతో పాటు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుపతి లడ్డూ ప్రసాద తయారీలో జంతువుల కొవ్వుతో తీసిన నెయ్యిని కలిపి.. తిరుమల శ్రీవారి ప్రతిష్టను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చిందంటూ చంద్రబాబు ఘాటు ఆరోపణలు చేయటం ఇప్పుడు …

Read More »