వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చంద్రబాబు సర్కార్ షాకిచ్చింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు చెప్పినట్లుగానే జరిగింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమించారనే ఆరోపణలు వస్తున్న స్థలంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేతలు మొదలయ్యాయి. ఈ మేరకు జీవీఎంసీ అధికారులు కూల్చివేతల్ని చేపట్టారు.. సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారని.. హైకోర్టు ఆదేశాలతో కూల్చివేస్తున్నట్లు చెబుతున్నారు. భీమిలిలోని సర్వే నంబర్ 1516, 1517, 1519, 1523లోని స్థలంలో ఈ కాంక్రీట్ నిర్మాణాలు ఉన్నాయి. ఇవి అక్రమ కట్టడాలంటూ జనసేన …
Read More »