ఆంధ్రప్రదేశ్‌లో యురేనియం తవ్వకాలకు బ్రేక్ పడింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను ఆపేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. యురేనియం లభ్యత, పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు తెలిపారు. ఇకపై అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగవు అన్నారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి జిల్లాకు చెందిన మంత్రి టీజీ …
Read More »Tag Archives: chandra babu naidu
TATA Group: ఏపీకి టాటా గ్రూప్ బంపరాఫర్.. టీసీఎస్ మాత్రమే కాదు అంతకు మించి..!
Tata Companies Chairman Chandrasekaran meets CM Nara Chandrababu naidu in Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో టీసీఎస్ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ఇవాళ (సోమవారం) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు నటరాజన్ చంద్రశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తెలియజేశారు. దివంగత రతన్ టాటా తన దార్శనిక నాయకత్వం, …
Read More »ఏపీలో వారందరికీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు.. ఉత్తర్వులు జారీ
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు సమ్మె కాలానికి వేతనాలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గతేడాది డిసెంబర్ 20 నుంచి 2024 జనవరి 10 జనవరి వరకూ.. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేశారు. కేజీబీవీలలో పనిచేసే వారితో పాటుగా జిల్లాలు, మండలాల్లోని సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు …
Read More »కేంద్రమంత్రులైనా ఎంపీలని మర్చిపోకండి.. తప్పించుకోవద్దు: చంద్రబాబు సీరియస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.702 కోట్లతో నిర్మించిన 5 సబ్ స్టేషన్లను కూడా వర్చువల్ గా ప్రారంభించారు. రూ.4,665 కోట్లతో చేపట్టనున్న 14 ఏపీ ట్రాన్స్ కో పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాకుళం, కృష్ణా, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఈ …
Read More »ఏపీలో వారికి అదిరిపోయే శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.35వేల నుంచి రూ.లక్షకు పెంపు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు ఇస్తామని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో.. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి 2029 నాటికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పేదలకు గృహనిర్మాణంపై సమీక్ష చేసిన చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ పురోగతిపై వివరించారు. డిసెంబరులో పీఎంఏవై 2.0 పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించేలా కేంద్ర …
Read More »చంద్రబాబు, పవన్, లోకేష్, బాలకృష్ణలపై అసభ్యకరంగా.. ఒకేరోజు ఏకంగా 47 పోలీస్ కేసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బాలయ్యలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు మొదలయ్యాయి. ఏపీలో కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను లక్ష్యంగా.. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై టీడీపీ, జనసేన పార్టీ నేతల ఫిర్యాదులతో విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఒక్కరోజే పోలీసులు 42 కేసులు నమోదు చేశారు. వీటిలో నందిగామ డివిజన్లో 14, సైబర్ పీఎస్‌లో 9, సెంట్రల్ డివిజన్లో 6, పశ్చిమ డివిజన్లో 5, సౌత్ డివిజన్లో 3, నార్త్ …
Read More »గుంటూరువాసులకు సూపర్ న్యూస్.. ఏసీలో దర్జాగా, కేంద్రానికి చంద్రబాబు సర్కార్ రిక్వెస్ట్‌తో!
గుంటూరువాసులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కాలుష్యం తగ్గించే దిశగా ప్రజా రవాణా వ్యవస్థలోకి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన ‘పీఎం ఈ-బస్ సేవ’ పథకంలో భాగంగా.. రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు వంద బస్సులు అవసరమని ప్రతిపాదించారు.. త్వరలోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే.. కాలుష్యం కూడా తగ్గుతుంది అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు నిర్వహణ వ్యయం కూడా తక్కువ.. అలాగే ఈ బస్సులకు ఒకసారి ఛార్జింగ్ …
Read More »దటీజ్ చంద్రబాబు.. అధికారి మాటను తూచా తప్పకుండా పాటించిన సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తెలుగు ప్రజలకే కాదు.. దేశంలో రాజకీయాలంటే కనీస అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ పరిచయం అక్కర్లేని పేరు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం.. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైనం.. గతంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర.. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉంటుంది. చంద్రబాబును ఇన్నేళ్లుగా రాజకీయాల్లో చూస్తున్న వారికి.. పాత చంద్రబాబుకు, ప్రస్తుత చంద్రబాబుకు తేడా తెలుస్తూనే ఉంటుంది. భావోద్వేగాలకు అతీతంగా, పనే ప్రథమ కర్తవ్యంగా …
Read More »దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. బుకింగ్ మాత్రం అప్పుడే..చంద్రబాబు ఆదేశాలు
chandrababu free gas cylinder scheme: ఆంధ్రప్రదేశ్ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలుపై సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆ శాఖ అధికారులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో చంద్రబాబు సమీక్షించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై వారితో చర్చించారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న …
Read More »MK Stalin: ప్రతీ జంట 16 మంది పిల్లల్ని కనండి.. చంద్రబాబు వ్యాఖ్యలకు స్టాలిన్ మద్దతు
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన స్టాలిన్.. ప్రతీ ఒక్కరు 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేశాయని.. అయితే దాని వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయి, లోక్‌సభ నియోజకవర్గాలు కూడా తగ్గుతున్నాయని తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ.. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంటులో …
Read More »