ఊహించని ప్రమాదం.. ఊహకందని విషాదం. రోజూలాగే పనికి వెళ్లిన కార్మికులను రియాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఒక్కసారిగా సంభవించిన పేలుడుతో అసలేం జరుగుతుందో తెలియని భయంకర పరిస్థితి. షాక్ నుంచి తెరుకునేలోపే తీవ్రంగా గాయపడ్డ కార్మికులు ఆర్తనాదాలు.. చనిపోయిన వారి మృతదేహాలతో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో హృదయవిదారకంగా మారిపోయింది.సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 37 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరో 35 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. …
Read More »