తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. గచ్చిబౌలి పీఎస్‌లో గతంలో ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టివేసింది. 2016లో సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు రేవంత్ రెడ్డి అతని సోదురు ప్రయత్నించారని పెద్దిరాజు అనే వ్యక్తి గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పెద్దిరాజు ఫిర్యాదును పరిగనణలోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు నాడు రేవంత్ రెడ్డి, అతని సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మయ్యలపై ఎస్సీ, ఎస్టీ నిర్బంధ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అయతే ఈ కేసును …
Read More »Tag Archives: cm revanth reddy
ఇవాళ ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ… బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ ప్రధాని మోదీతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై మోదీతో చర్చించే ఛాన్స్ ఉంది. ప్రధానితో భేటీ అనంతరంర ఆయన సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక సంస్థలతో పాటుగా, విద్యా ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కేంద్రానికి కూడా పంపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రిజర్వేషన్లను పెంచుకునేందుకు …
Read More »వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు… వనమహోత్సవంలో సీఎం కీలక వ్యాఖ్యలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు టికెట్లపై సీఎం రేవంత్ కీలకవ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందన్నారు. మహిళలకు 60 సీట్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటా అని రేవంత్ భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రేవంత్ పునరుద్ఘాటించారు. రాంజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణకు పచ్చని చీరను కప్పేందుకు మనందరం కృషి …
Read More »వారంలో రెండుసార్లు విజిట్.. వారికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని అనేక సార్లు ప్రకటించిన రేవంత్ సర్కార్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే.. విద్యాశాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా.. తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు సార్లు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని అధికారులు సీఎం …
Read More »పీఏసీ మీటింగ్‌లో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
కాంగ్రెస్ అంటేనే నిలదీతలు.. నినాదాలు కామన్. కానీ మంగళవారం జరిగిన పీఏసీ సమావేశంలో ఇవేవీ కనిపించలేదు. అంజన్ కుమార్ లాంటి నేతలు పదవులపై ప్రశ్నిస్తే.. జగ్గారెడ్డి లాంటి నేతలు రేవంత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కార్యకర్తలను ఖుషీ చేయాలంటూ సూచనలు చేశారు. మరోవైపు ధర్నా బ్యాచ్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం హాట్‌గా జరిగింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తమ సామాజికవర్గమంతా అసంతృప్తిగా ఉందన్నారు. తెలంగాణలో యాదవులకు కీలక పదవులు ఇవ్వలేదన్నారాయన. …
Read More »ఆషామాషీగా బకచర్లకు అనుమతులు రానివ్వం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృథాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు చెప్పడం విస్మయం కలిగిస్తోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం త్రీపాయింట్ …
Read More »ఇక కొలువుల జాతర మొదలు – తెలంగాణ లో భారీగా ఉద్యోగాలు
తెలంగాణలో నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రక్రియలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. గత ఏడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకుని నిలిపివేసిన ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి వెలువడనున్నాయి. గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైన కార్యాచరణ రూపొందించనుంది. ఎస్సీ వర్గీకరణ చట్టంతో ఆగిన ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి …
Read More »లక్షలాదిమంది రైతులకు గుడ్ న్యూస్ అంటోన్న కాంగ్రెస్ సర్కార్
లక్షలాదిమంది రైతులకు గుడ్ న్యూస్ అంటోంది తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్. తెలంగాణలో ఏప్రిల్ 14, సోమవారం నుంచి భూ భారతి చట్టం అమల్లోకి రాబోతుంది. ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ కూడా అందుబాటులోకి రానుంది. ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలతో పోర్టల్‌ను మరింత పటిష్టంగా రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు.తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. ఆర్వోఆర్-2020 స్థానంలో ఆర్వోఆర్-2025 భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతోపాటు ధరణి స్థానంలో భూ …
Read More »వ్యసనాలకు తెలంగాణలో తావులేదు.. తప్పు చేస్తే శిక్ష తప్పదుః సీఎం రేవంత్ రెడ్డి
బెట్టింగ్ వ్యవహారాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ యాప్స్‌పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించామన్నారు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను వేయాలని నిర్ణయించినట్టు అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదన్నారు ముఖ్యమంత్రి. అభివృద్ధి కోసం కలిసి వస్తే అన్ని పార్టీల సలహాలు, సూచనలు తప్పకుండా పాటిస్తామన్నారు. ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించినా, నిర్వహణలో భాగస్వాములైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేవలం …
Read More »హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి.. మైక్రోసాఫ్ట్ నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మైక్రోసాఫ్ట్ ఇండియా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత క్యాంపస్ అంతా తిరిగి పరిశీలించారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ మరో కీలక నిర్ణయం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 1.2 లక్షల మందికి పైగా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శిక్షణను అందించేందుకు మూడు కొత్త ప్రోగ్రాంలను ప్రకటించింది.ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించింది. …
Read More »