Tag Archives: crime

శ్రీశైలంలో కలకలం.. రాత్రివేళ కొండ పై నుంచి దూకిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరేశ్వరం ఆలయ సమీపంలోని కొండపై నుంచి దూకి బుర్రె వెన్నెల అనే యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి వెన్నెల ఆన్లైన్ లోన్ యాప్ వేదింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి ఆత్మహత్యాయత్నం కోసం నిన్న రాత్రి శిఖరం వద్ద చేరుకుంది. కొండపై నుంచి సుమారు 20 అడుగుల లోతులోకి దూకడంతో పక్కనే ఉన్న భక్తులు వెంటనే స్పందించి.. స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం …

Read More »

ఢిల్లీలో కాల్పుల కలకలం.. మార్నింగ్ వాక్ చేసి ఇంటికి వెళ్తున్న వ్యాపారిని కాల్చి చంపిన దుండగులు

ఢిల్లీలో దారుణం జరిగింది. మార్నింగ్ వాకింగ్ కోసం బయటకు వచ్చిన వ్యాపారి సునీల్ జైన్. బైక్‌పై వచ్చిన దుండగులు వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని 6 – 7 రౌండ్లు కాల్పులు జరిపారు.దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. షహదారాలోని విశ్వాస్ నగర్‌లో ఓ వ్యాపారిని దుండగులు కాల్చిచంపారు. వ్యాపారవేత్తలు ఉదయం మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లారు. ఇంతలో బైక్‌పై వచ్చిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. కాల్పుల్లో వ్యాపారి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి …

Read More »

వామ్మో.. కొత్త రకం సైబర్ నేరాల లిస్ట్ ఇది.. అలెర్ట్‌గా లేరంటే అంతే సంగతులు

రోజుకో కొత్త రకం నేరాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒకరకంగా నమ్మించి వారి బ్యాంక్ అకౌంట్స్ పూర్తిగా ఖాళీ చేసేస్తున్నారు. ఈ విషయాల పట్ల సరైన అవగాహన లేకపోవడంతో బాగా చదవుకున్న వారు కూడా సైబర్ నేరగాళ్ల బుట్టలో పడి లక్షలు, కోట్లు కోల్పోతున్నారు. దీనికి సంబంధించి నిత్యం వార్తా కథనాలను మనం చూస్తూనే ఉన్నాం.. ట్రాయ్‌తో పాటు పోలీసులు సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆన్‌లైన్ వేదికగా పలు అవగాహన కార్యక్రమాలను సైతం చేపడుతోంది.  మరి ప్రస్తుతం ట్రెండింగ్‌లో …

Read More »

కాలం తీరిన మందులిచ్చి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డాక్టర్లు.. గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్న యువకుడు..

హైదరాబాద్ పాతబస్తీలో అపెండిక్స్‌ ఆపరేషన్‌ కోసం ఆస్పత్రిలో సర్ఫరాజ్‌ అనే యువకుడు చేరాడు. ఆ యువకుడికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు కాలం చెల్లిన సెలైన్‌తో పాటు ఇంజెక్షన్లు, మందులు ఇచ్చారు. దీంతో యువకుడి ఆరోగ్యం క్షీణించింది. రోజు రోజుకి ఆ యువకుడి ఆరోగ్యం చేయిదాటిపోవడంతో కుటుంబ సభ్యులకు వైద్యులపై పలు అనుమానాలు వచ్చాయి. మందులపై దృష్టిపెట్టగా 9 నెలల క్రితమే కాలం చెల్లిన మందులు ఇచ్చినట్టు తేలింది. దీంతో ఆధారాలతో సహా మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ …

Read More »

పెన్షన్ ఇస్తామని నమ్మించారు.. చివరికి వృద్ధులను ఇలా చేశారు..!

అన్‌నోన్‌ కాల్‌ ఎత్తారో అడ్డంగా బుక్కైపోతారు. అవతలివారి మాటలు నమ్మారో నిండా మునిగిపోతారు. మాటలతో బెదిరిస్తారు సైబర్‌ బూచోళ్లు. ఎకౌంట్లో క్యాష్‌ పడేదాకా టార్చర్‌ పెడతారు. చదువుకున్నోళ్లు, ఉద్యోగులు కూడా మోసగాళ్ల బారినపడుతున్నారు. కొత్త టెక్నిక్స్‌తో జనాన్ని ట్రాప్‌ చేస్తున్నారు.. మోసాల్లో ముదిరిపోయిన సైబర్‌ క్రిమినల్స్‌. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త నేరంతో పోలీసులకు సవాలు విసురుతున్నారు. తాజాగా వృద్ధులకు వచ్చే పెన్షన్లను సైతం కాజేసేందుకు సిద్ధమవుతున్నారు. రీసెంట్‌గా చాలామంది వృద్ధులు అనవసర లింకులను క్లిక్ చేసి తమ ఖాతాల్లోని డబ్బులు పోగొట్టుకున్నారు. పెన్షన్ …

Read More »

వీళ్లు మామూలు దొంగలు కాదు.. నిలబడినట్టే నిలబడి 6లక్షలు దోచేశారు..

దొంగతనం ఎప్పుడైనా జరగొచ్చు.. ఎవరైనా చేసేయొచ్చు. జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత.. ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్నా.. ఇదిగో ఇలా దోచేస్తారు దొంగలు.. తాజాగా.. ఆదిలాబాద్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు.. బేల మండల కేంద్రంలో ఉన్న శ్రీకర్‌ మార్ట్‌లో పట్టపగలే భారీగా చోరీ చేశారు.. రూ.5.87లక్షలు నగదు ఉన్న సంచిని అందరి ముందే.. గుట్టుగా చోరీ చేసి పరారయ్యారు.. అయితే, చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.. డబ్బు ఉన్న సంచిని చోరీ చేసిన ఇద్దరు యువకులు.. ఎవరూ చూడని సమయంలో …

Read More »

ములుగు జిల్లాలో ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌

ములుగు జిల్లాలో ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్యలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. హరీష్ ఆత్మహత్య ఘటనలో యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి అనుకోకుండా ఫోన్ చేయగా, మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేది.. కొంతకాలానికి యువతి బ్యాగ్రౌండ్ వెరిఫై చేయగా.. తను వేరే వాళ్లతో చనవుగా ఉన్నట్లు హరీష్ గుర్తించాడు. దీంతో తన ప్రవర్తన నచ్చక దూరంపెట్టాడు ఎస్సై. ఆపై …

Read More »

స్వర్ణ దేవాలయంలో కాల్పుల కలకలం.. బాదల్‌పై దాడి చేసిన నారాయణ్‌సింగ్ చౌరా ఎవరో తెలుసా..?

శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ బాదల్‌పై పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బుధవారం (డిసెంబర్ 4) దాడి జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో సుఖ్‌బీర్ బాదల్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో సేవ చేస్తుండగా ఓ వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు కాల్పులు జరుపుతున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సుఖ్‌బీర్ బాదల్ క్షేమంగా బయటపడ్డారు. అయితే అకాలీదళ్ నాయకుడు ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. గురుద్వారాలో శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ ఇచ్చిన మతపరమైన …

Read More »

ప్రాణాలు తీస్తున్న ట్రావెల్స్ బస్సులు.. రెప్పపాటులో ఘోరం.. ఆటోలో వెళ్తుండగా..

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు అడ్డదిడ్డంగా బస్సులు నడుపుతూ ఎక్కడి పడితే అక్కడ ప్రమాదాలకు కారణం అవుతున్నారు.. గమ్యస్థానాలకు తొందరగా వెళ్లాలనే ఆత్రుతో లేక ప్రమాదం జరిగితే మాకేమవుతుందిలే అనే అహంకారమో.. తెలియదు గానీ బస్ డ్రైవర్లు అధిక స్పీడ్‌తో బస్సులను నడిపి ఆటోలను ద్విచక్ర వాహనాలను గుద్దేసుకుంటూ నిత్యం ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. తాజాగా ఓ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిడిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. పోరుమామిళ్ల కాలువ కట్ట సమీపంలో ఆటోను …

Read More »

మరో పరువు హత్య.. కానిస్టేబుల్‌ను దారుణంగా నరికి చంపిన తమ్ముడు..

తమ్ముడి కుల కావరానికి లేడీ కానిస్టేబుల్‌ బలైపోయింది. కులాంతర వివాహం చేసుకుందని సొంత అక్కనే చంపేశాడు తమ్ముడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఈ పరువు హత్య తెలంగాణ కలకలం రేపుతోంది.. కులాంతర ప్రేమ వివాహం చేసుకుందని కానిస్టేబుల్‌ నాగమణిని తమ్ముడు పరమేష్‌ నరికి చంపాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో జరిగింది. హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణి.. సోమవారం ఉదయాన్నే స్వగ్రామం రాయపోలు నుంచి హయత్‌నగర్‌ బయల్దేరింది.. ఈ క్రమంలో నాగమణి కోసం దారికాచిన తమ్ముడు …

Read More »