Tag Archives: crime news

ఇంటికి పార్శిల్ వచ్చిందని తెరిచి చూస్తే.. గుండె ఆగినంత పనైంది..

ఏదైనా వస్తువును మనం ఆన్లైన్లో గాని, ఇతరత్రా మాధ్యమాల ద్వారా బుకింగ్ చేసుకున్నప్పుడు పార్సిల్ మన ఇంటి దగ్గరికే వస్తుంటాయి. కొందరైతే ఆ పార్సెల్ ఎప్పుడు వస్తుందా..? అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, సడన్ గా ఓ ఇంటికి ఓ పార్సెల్ వచ్చింది. ఆత్రుతగా ఆ పార్సిల్ ఓపెన్ చేశారు. ఇంకేముంది గుండె ఆగినంత పనైంది..ఏదైనా వస్తువును మనం ఆన్లైన్లో గాని, ఇతరత్రా మాధ్యమాల ద్వారా బుకింగ్ చేసుకున్నప్పుడు పార్సిల్ మన ఇంటి దగ్గరికే వస్తుంటాయి. కొందరైతే ఆ పార్సెల్ ఎప్పుడు వస్తుందా..? …

Read More »

బాబోయ్ వీళ్లు మామూలోళ్లు కాదు.. హైవేపై మకాం వేస్తారు.. లిఫ్ట్ ఇచ్చారో ఇక అంతే సంగతులు..

వ్యాపారాల్లో నష్టాలు రావడం సహజమే. నష్టాలను పూడ్చుకునేందుకు వ్యాపారులు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తారు. కానీ వీరు మాత్రం నష్టాలను అధిగమించేందుకు కొత్త మార్గాన్ని అనుసరించారు. నష్టాలను పూడ్చుకోవడానికి వీరు లిఫ్ట్ అడిగి బురిడీ ఎలా కొట్టించారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…! సికింద్రాబాద్ ఇందిరమ్మనగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొరపాటి నర్సింగరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురం మండలం బంధలుప్పి గ్రామానికి చెందిన బాత ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయమై స్నేహితులుగా మారారు. …

Read More »

కెనడాకు వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు.. అనుమానాస్పద మృతిగా తల్లిదండ్రుల ఆందోళన..!

చదువుకునేందుకు విదేశానికి వెళ్ళిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆకస్మిక మరణం చెందినట్టు ఇంటికి సమాచారం అందగానే కన్నీరు మున్నిరై విలపించారు కుటుంబ సభ్యులు. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకొని.. మృతి పై విచారణ జరిపించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు.విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల ఫణి కుమార్.. ఎంబీఏ పూర్తి చేశాడు. ఎమ్మెస్ చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని.. కెనడాకు వెళ్ళాడు. ఆగస్టు 21న కెనడాలోని కాల్గరి నగరంలో ఉన్న సదరన్ ఆల్బర్ట్ ఆ …

Read More »

వీడేం దొంగరా సామీ..! చోరీకి వచ్చి ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

వాళ్లు మామూలు దొంగలు కాదు. సింపుల్‌గా వస్తారు. గేటు తీసుకుని దర్జాగా వెళ్తారు. ఏదో అందినకాడికి తీసుకెళ్లే రకం కాదు.. ఇంట్లో కనిపించిన నీళ్ల బిందెను ఎత్తుకెళ్లారు. ఈ తతంగం అంతా ఇంటి అవరణలో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.మనం దొంగతనాలు గురించి వింటూ ఉంటాం..! మనం కూడా కొన్ని సందర్భాల్లో బాధితులమే.. రకరకాల దొంగతనాలు చూసి ఉంటాం. ఈ విచిత్ర దొంగతనం కొంచెం కామెడీగా ఉంది. కానీ నిజం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో విచిత్ర దొంగతనం జరిగింది. స్థానికుల …

Read More »

అల్లుడు గిల్లుడు మామూలుగా లేదుగా.. పిలిచి పిల్లనిస్తే ఏం చేశాడో తెలుసా..?

ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో పదిహేను రోజుల క్రితం వరుసచోరీలు జరిగాయి. గ్రామంలో ఇళ్ళకు తాళాలు వేసి కూలిపనుల కోసం వలసలు వెళ్ళిన 12 ఇళ్ళల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామస్థులంతా ఉలిక్కి పడ్డారు.అల్లుడి హోదాలో ఆ ఊరు వచ్చాడు.. పిల్లనిచ్చిన మామ ఇంట్లో సెటిలయ్యాడు.. సొంత ఊరును కాదని అత్తగారి ఊళ్ళో మకాం పెట్టడం వెనుక మర్మం తెలియక భార్య, అత్తమామలు మా మంచి అల్లుడు అంటూ తెగ మురిసిపోయారు.. ఊరంతా ఊరుమ్మడి అల్లుడిలా …

Read More »

ఛీ.. ఛీ.. ఆస్తి కోసం ఎంత పని చేశావ్.. సొంత అన్నదమ్ములను కడతేర్చిన సోదరి..

వ్యసనాలకు బానిసయ్యారు.. తండ్రి డబ్బులు కోసం కుస్తీ పడ్డారు. ఒకరిపై మరొకరికి అనుమానం పెరిగిపోయింది. దీంతో ఆస్తిని దక్కించుకునే క్రమంలో అన్నదమ్ముల్నే ఏకంగా హత్య చేసింది ఒక సోదరి… ఈ విషాద ఘటన పల్నాడు జిల్లా నకరికల్లులో చోటు చేసుకుంది.మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. మారిపోతున్న మానవీయ విలువల గురించి ఈ పాటను మనం తరచూ గుర్తుచేసుకుంటుంటాం.. నిజంగా.. నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.. ఆధునిక కాలంలో మనుషులంతా మారిపోతున్నారు. ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసే వారు.. …

Read More »

అయ్యో దేవుడా.. ఉదయాన్నే ఎంత ఘోరం జరిగింది.. స్కూల్‌బస్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి..

స్కూల్ బస్సు వచ్చింది.. ఎప్పటిలాగే.. విద్యార్థులంతా బస్సెక్కి స్కూల్ కు బయలు దేరారు.. మార్గ మధ్యలో బస్‌ రేడియేటర్‌లో నీళ్లు అయిపోవడంతో.. డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు.. రేడియేటర్ చెక్ చేసి.. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పిలిచి నీళ్లు తేవాలంటూ పక్కే ఉన్న కుంట దగ్గరికి పంపించాడు.. అయితే.. ఆ విద్యార్థి డబ్బా తీసుకుని.. పొలంలో ఉన్న కుంట దగ్గరికి వెళ్లాడు.. అక్కడ డబ్బాలో నీళ్లు నింపుతూ విద్యార్థి కుంటలో జారి పడ్డాడు.. ఈత రాకపోవడంతో కేకలు వేస్తూ నీళ్లలో మునిగిపోయాడు.. …

Read More »

చిన్నారి ప్రాణం తీసిన మూఢనమ్మకం.. నెల్లూరు జిల్లాలో విషాదం

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. చర్చిలో ప్రార్థనలు చేస్తే బతుకుతుందనే ఆశతో చిన్నారి తల్లిదండ్రులు చేజర్ల మండలం అదురుపల్లిలోని చర్చిలో భవ్యశ్రీతో ప్రార్థనలు చేయిస్తూ వచ్చారు. సుమారు 40 రోజుల పాటు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. అయితే భవ్యశ్రీ ఆరోగ్యం విషమించి సోమవారం రాత్రి కన్నుమూసింది. దీంతో భవ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే చర్చిలో ప్రార్థనలు చేస్తే ఆరోగ్యం బాగవుతుందని.. ఆస్పత్రికి వెళ్లకుండా తల్లిదండ్రులను పాస్టర్ మభ్యపెట్టారంటూ కుటంబసభ్యులు ఆరోపిస్తున్నారు. …

Read More »

ఇరవై ఏళ్ల నుండి కొనసాగుతున్న అక్రమ సంబంధం.. కట్ చేస్తే.. పొలంలోకి రమ్మని..

ఆమె పేరు రమాదేవి..  సత్తెనపల్లి రంగా కాలనీలో నివాసం ఉండే రమాదేవికి వివాహమైంది.. ఇద్దరు పిల్లలున్నారు. అయితే రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన వెంకట్రావుతో రమాదేవికి వివాహేతర సంబంధం ఉంది. వెంకట్రావుకి వివాహమై ఇద్దరూ పిల్లలున్నారు. రమాదేవి, వెంకట్రావులకు పెళ్లై పిల్లలున్నా వీరిద్దరి మధ్య గుట్టు చప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. దాదాపు ఇరవై ఏళ్ల నుండి వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే రమాదేవి తన బంగారాన్ని వెంకట్రావు చేత బ్యాంక్‌లో తాకట్టు పెట్టించింది. అయితే ఇద్దరూ మధ్య ఎటువంటి …

Read More »

ఒక్కడిని చేసి దాడి.. కట్ చేస్తే.. ప్రమాదం జరిగి ఒళ్లంతా గాయాలు.. అంతా కర్మ ఫలితమేనా!

సత్కర్మభీశ్చ సత్ఫలితం.. దుష్కర్మ ఏవ దుష్ఫలం.. అత్యుత్కట పుణ్యపాపానాం సత్యంబలానుభవమిహం.. పురాణాల్లో ఉన్న శ్లోకమిది. మంచి పనులు చేయడం వల్ల మంచి ఫలితమూ, చెడ్డ పనులు చేయడం వల్ల చెడు ఫలితమూ వస్తాయని.. ఏదైనా మనం చేసిన దాని ఫలితాన్ని అనుభవించాల్సిందేనని చెప్పేదే కర్మ సిద్ధాంతం. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి వైరల్ అవుతున్న ఓ కథనం, ఫోటోలు, వీడియోలు చూస్తే.. కర్మ సిద్ధాంతం నిజమేనని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. అమ్మాయికి మెసేజ్ చేశాడనే …

Read More »