Tag Archives: cyclone

తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి కుండబోత వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ఈ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ గంటకు 13 కిలో మీటర్ల వేగంతో కదులుతోంది. పశ్చిమ-వాయువ్య దిశగా ఫెంగల్ కదులుతూ.. పుదుచ్చేరికి 120 కి.మీ..చెన్నైకి 110 కి.మీ, నాగపట్నానికి 200 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది. ఫెంగల్ …

Read More »

Cyclone Dana: తీవ్ర తుఫానుగా తీరం దాటిన ‘దానా’..ఒడిశా, బెంగాల్‌లో పెను విధ్వంసం

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తీవ్ర తుఫాన్‌ (Cyclone Dana) గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటింది. ఒడిశాలోని బిత్తర్‌కనిక‌లోని హబలిఖాటి జాతీయ పార్క్‌, ధమ్రా మధ్య అర్ధరాత్రి 1.30 నుంచి మొదలైన ఈ ప్రక్రియ.. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు కొనసాగినట్టు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తీరం దాటిన ‘దానా’ శుక్రవారం ఉదయం 12 గంటల వరకు తీవ్ర తుఫానుగా కొనసాగి తర్వాత బలహీనపడి తుఫానుగా మారుతుందని, సాయంత్రానికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా, రాత్రికి వాయుగుండంగా …

Read More »

Cyclone Dana: దానా తుఫాను ఎఫెక్ట్.. 4 రోజులపాటు స్కూళ్లకు సెలవులు

Cyclone Dana: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి.. అల్పపీడనంగా మారి క్రమంగా వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఆ తర్వాత అతి తీవ్ర తుఫానుగా మారనుంది. దీనికి దానా తుఫాను అని ఇప్పటికే భారత వాతావరణ శాఖ పేరు పెట్టింది. ఇక ఈ దానా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఉండనుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే …

Read More »

గుజరాత్‌‌కు ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు.. అస్నాగా నామకరణం

గుజరాత్‌కు తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. తుఫాన్‌గా మారింది. కచ్‌ తీరం, పాకిస్థాన్‌ పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఈ తుఫాన్‌కు అస్నాగా పేరు పెట్టగా.. ఈ పేరును పాకిస్థాన్‌ సూచించింది. అరేబియా సముద్రంలో 1976 తర్వాత ఆగస్టు నెలలో ఏర్పడిన తొలి తుఫాన్‌ అని చెబుతున్నారు. కచ్‌ తీరం మీదుగా ఆవరించిన అస్నా తుఫాన్ అరేబియా సముద్రంలోకి ఒమన్‌ దిశగా కదిలింది. ఆగస్టులో తుఫాన్‌లు రావడం చాలా అరుదు అని చెబుతున్నారు.. అయితే సముద్రాలు వేడెక్కడంతో తుఫాన్‌ ఏర్పడింది …

Read More »