ప్రతిపక్ష హోదా విషయంలో తగ్గేదేలే.. అని వైసీపీ నేతలు అంటుంటే.. అసలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదేలే.. అంటున్నారు కూటమి నేతలు.. ఏపీ బడ్జెట్ సమావేశాల వేళ వైసీపీ-కూటమి నేతల మధ్య విపక్ష హోదా మరోసారి అగ్గి రాజేసింది. ప్రతిపక్ష హోదా మా హక్కు అని ఫ్యాన్ పార్టీ డిమాండ్ చేస్తుంటే.. అడుక్కుంటే LOP హోదా ఇవ్వరని కౌంటర్ ఇస్తోంది సర్కార్.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు గవర్నర్ నజీర్ ప్రసంగించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ.. స్వర్ణాంధ్ర విజన్ ఆవిష్కరణే లక్ష్యంగా …
Read More »Tag Archives: DCM
జన సైనికులకు పవన్ బహిరంగ లేఖ.. అలా చేయొద్దంటూ వినతి
జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి జనసేన వారు ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లిబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయొద్దని పవన్ కోరారు. ప్రతీ ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడవాల్సిన …
Read More »లా అండ్ ఆర్డర్ విషయంలో ఇష్టారాజ్యంగా ఉంటే తొక్కి నార తీస్తాః డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆరు నెలలు అయింది.. హనీమూన్ ముగిసింది.. ఇప్పటికీ మేలుకోకపోతే మేటర్ సీరియస్సే.. అంటూ అధికారుల సీటు కింద హీటు పెంచేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. ఇప్పటిదాకా నేను ప్రశ్నించా..ఇకమీదట మీరు ప్రశ్నించండి అంటూ ప్రజానీకానికి బంపరాఫర్ ఇచ్చారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇస్తూనే.. ఆ విధంగా ప్రజలకూ భరోసానిచ్చే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో మినీ గోకులాన్ని పవన్ …
Read More »పోటీపడండి.. హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
కొన్ని సూచనలు.. ఇంకొన్ని సలహాలు.. మరికొన్ని బాధ్యతలు గుర్తుచేస్తూ మొదటి రోజు కొనసాగింది సీఎం చంద్రబాబుతో కలెక్టర్ల సమావేశం. హార్డ్ వర్క్ కాదూ.. స్మార్ట్‌గా దూసుకుపోవాలని ప్రధానంగా కలెక్టర్లకు సూచించారు సీఎం..గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, బియ్యం మాఫియా పెరిగిపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇకపై ఏ జిల్లాలో అయినా బియ్యం, గంజాయ్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు.. సీఎం చంద్రబాబు ఆదేశించారు.. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని.. ఇందుకోసం …
Read More »పవన్ ‘సీజ్ ది షిప్’ తర్వాత రగులుతున్న రాజకీయం.. రచ్చ మామూలుగా లేదుగా..
చౌకబియ్యం చుట్టూ జరుగుతున్న రాద్ధాంతం.. ఏపీ రాజకీయాల్ని ఉడుకెత్తిస్తోంది. సీజ్ ది షిప్.. అంటూ కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం మొదలుపెట్టిన బియ్యం గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఇంతకీ.. ఆ బియ్యం ఎవరివి.. అని ఆరా తీస్తే.. మంత్రిగారి వియ్యంకుడి పేరే బైటికొస్తోంది. ఇంకేముంది విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇష్యూని మరింత సీరియస్ చేస్తూ బాంబులు పేల్చాయి. మరి కూటమి ప్రభుత్వం రియాక్షన్లేంటి..? రెండుగంటల పాటు జరిగిన భేటీలో సీఎం, డిప్యూటీ సీఎం తేల్చిందేంటి…? డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మొన్న కాకినాడ పోర్టులో హల్‌చల్ చేసి.. …
Read More »డిప్యూటీ సీఎంగా ఉన్న నాకే సహకరించడం లేదు.. కేంద్రానికి లేఖ రాస్తా: పవన్ కల్యాణ్ ఫైర్
ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కాకినాడలో ఇల్లీగల్ వ్యవహారాల అంతు తేలుస్తామంటున్నారు. యాంకరేజ్ పోర్టులో పర్యటించిన పవన్ కల్యాణ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలసత్వం వహిస్తే ఊరుకునేదిలేదంటూ వార్నింగ్ ఇచ్చారు.కాకినాడ యాంకరేజ్ పోర్టు అక్రమార్కులకు అడ్డాగా మారింది. కొన్ని ముఠాలు రేషన్ బియ్యం సహా పలు రకాల వస్తువులను ఓడలో విదేశాలకు తరలిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ రెండు రోజుల క్రితం సముద్రంలో …
Read More »పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కుర్ర హీరో.. ఆ సినిమా ఎదో తెలుసా.?
పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఆయన లైనప్ చేసిన సినిమాల షూటింగ్స్ కూడా పూర్తి చేస్తున్నారు. పవన్ లైనప్ చేసిన సినిమాలు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఇక థియేటర్స్ దగ్గర పవన్ అభిమానులు చేసే హంగామా మాములుగా …
Read More »Adani Bribe Case: ఆ ఒప్పందాలను రద్దు చేస్తారా..? క్లారిటీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. నాన్‌స్టాప్ భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు.. మంగళవారం కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, సీఆర్ పాటిల్, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్ ఇలా పలువురు నేతలతో భేటీ అయిన పవన్ కల్యాణ్.. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిపారు.. కాగా.. పవన్ కల్యాణ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. దానికి ముందు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర …
Read More »