అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ హుండీ నుంచి 1.39.6 క్యారెట్ల ముడి వజ్రం బయటపడింది. అంతేకాకుండా వజ్రంతో పాటు ఒక ఉత్తరం కూడా లభించింది. ఆ ఉత్తరంలో దాత తనకు ఈ వజ్రం దొరికిందని, అది నిజమైనదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే స్వామివారికి సమర్పిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ వజ్రాన్ని స్వామివారి అలంకరణ ఆభరణాల తయారీకి వినియోగించాలని కోరారు. ఈ సమాచారం అందుకున్న …
Read More »