గురుకులాల్లో సమస్యలు విద్యార్థులను అల్లకల్లోలం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆహార కల్తీ తో ఆస్పత్రి పాలైన విద్యార్థులు… ఇప్పుడు ఉపాధ్యాయులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ రోడ్డెక్కారు. జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఏకంగా 20 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ జిల్లా కలెక్టర్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమపై వేధింపులకు పాల్పడుతున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జోగుళాంబ గద్వాల్ జిల్లా బీచుపల్లి బాలుర గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన సంచలనంగా మారింది. తమను వేధిస్తున్న ప్రిన్సిపల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ …
Read More »