హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వర్షం నాన్‌స్టాప్‌గా పడుతూనే ఉంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు నదుల్లా మారిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, మియాపూర్, మలక్‌పేట్, చంచల్‌గూడ, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. చాలాచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి వచ్చాయి. కొన్నిచోట్ల వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వర్షంతో నెలకొన్న పరిస్థితులపై …
Read More »