Tag Archives: IAS

AP News: ఇద్దరు ఐఏఎస్‌ల ప్రేమ పెళ్లి.. కోనసీమలో సందడే, సందడి

ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐఏఎస్‌ శిక్షణలో ఇద్దరికీ పరిచయం ఏర్పడగా.. ఇద్దరి మనసులు కలిసి ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల్ని ఒప్పించి మరీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట పెళ్లిని ఇరు కుటుంబాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరుడి స్వగ్రామం ఈ పెళ్లి వేడుకకు వేదిక అయ్యింది.. సందడి వాతావరణం కనిపించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రుకు చెందిన తరెట్ల ధర్మారావు ఐఏఎస్‌ అధికారి.. మధ్యప్రదేశ్‌‌లో కమిషనర్‌ స్థాయి వరకు బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ …

Read More »

AP News: సెలవుపై వెళ్లిన ఐఏఎస్ ఆమ్రపాలి.. కారణం ఏంటంటే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆమ్రపాలి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతో ఐఏఎస్ అధికారిణి పది రోజుల పాటూ సెలవుపై వెళ్లారు. ఆమ్రపాలి సెలవు నుంచి వచ్చే వరకు.. రాష్ట్ర కళాశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తాకు పర్యాటకాభివృద్ధి ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఆమ్రపాలి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఆమెను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌గా నియమించగా.. ఈ నెల 6న బాధ్యతలు స్వీకరించారు.. ఇప్పుడు సెలవులో …

Read More »

తెలంగాణ నుంచి మరో ఐఏఎస్‌కు ఏపీలో పోస్టింగ్.. కీలక బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్ ఇచ్చింది.. ఈ మేరకు సీఎస్ నీరబ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి వచ్చిన రోనాల్డ్ రోస్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను ఆర్థికశాఖ కార్యదర్శి (బడ్జెట్‌ నిర్వహణ, ఇన్‌స్టిట్యూషనల్‌ ఫైనాన్స్‌)గా నియమించింది. అలాగే సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న కె.కన్నబాబుకు.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అలాగే ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీగా పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న బి.అనిల్‌కుమార్‌రెడ్డిని …

Read More »

ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు రంగంలోకి యాంటీ నక్సల్ స్పెషలిస్ట్.. జమ్ముకశ్మీర్ డీజీపీగా ఏపీ క్యాడర్ ఐపీఎస్

జమ్మూకశ్మీర్‌ శాంతి భద్రతలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లో ఈ మధ్య కాలంలో ఉగ్రదాడులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉగ్రమూకల దాడులను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ ప్రభాత్‌ను జమ్మూ కశ్మీర్ స్పెషల్ డీజీగా నియమించింది. సెప్టెంబర్ 30వ తేదీ ప్రస్తుతం డీజీగా ఉన్న ఆర్ఆర్ స్వైన్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన రిటైర్‌మెంట్ తర్వాత నళిన్ ప్రభాత్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. …

Read More »

ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే..

కలలు కనండి సాకారం చేసుకోండి అని ఇండియన్ మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం ఇచ్చిన నినాదం. అయితే కలలు కంటున్న విద్యార్థులను లక్ష్యంవైపు తీసుకెళ్లేందుకు ఆయన చేస్తున్న కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి. సింగరేణి కార్మికుని ఇంట పుట్టిన ఆయన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)కు ఎంపికై బీఎస్ఎన్ఎల్‎లో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదులుకుని నేటి తరానికి మార్గదర్శిగా నిలుస్తున్నారు. ట్రిపుల్ ఐటీ లాంటి విద్యా సంస్థల్లో చదువుతున్న వారు లక్ష్యం వైపునకు అడుగులు వేయలేకపోతున్నారని గమనించిన చింతల రమేష్ …

Read More »