Tag Archives: IT

ఐఐటీ, నీట్‌లాంటి ప్రఖ్యాత సంస్థల్లో చదివి.. సాఫ్ట్‌వేర్ జాబ్‌లు కాదని.. ఏఈఈ ఉద్యోగాలకు మొగ్గు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. కార్పొరేట్ సెక్టార్‌లో ఐదంకెల జీతం.. హైఫై లైఫ్.. వారంలో రెండ్రోజులు హాలీడే, విదేశీ ట్రిప్పులు ఇలా చాలా సౌకర్యాలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ఉంటాయి. దీంతో చాలా మంది యువత బీటెక్‌లు చదివి సాఫ్ట్‌వేర్ రంగం వైపు మెుగ్గుచూపుతారు. గత పదేళ్లుగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సాఫ్ట్‌వేర్ రంగంపై వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. అయితే ప్రస్తుతం సీన్ మారుతోంది. కోట్ల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటే.. సెక్యూరిటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగాల వైపు యువత …

Read More »

ఎట్టకేలకు దిగొచ్చిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. వారందరికీ ఉద్యోగాలు.. ఇప్పటికే ఆఫర్ లెటర్స్!

ఐటీ ఉద్యోగుల్లో కొంత కాలంగా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. చాలా వరకు.. లేఆఫ్స్ ప్రభావం తమపై ఉంటుందని కంగారుగా ఉన్నారు. కారణం.. ఏడాది వ్యవధిలో దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వరుసగా తగ్గుతుండటమే. అతిపెద్ద భారత ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా అన్ని కంపెనీల్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులు తగ్గిపోయారు. ఇదే సమయంలోనే అసలు నియామకాల ఊసే లేదు. దీంతో ఫ్రెషర్లు తీవ్ర ఆందోళన చెందారు. ఇప్పటి సంగతి పక్కనబెడితే.. దిగ్గజ …

Read More »

ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై నేడు చంద్రబాబు సమీక్ష

ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీ రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చ జరగనుంది. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు నిర్వహించనున్నారు. అమరావతి: ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్) శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీకి రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై ఈ సమీక్షలో చర్చ జరగనుంది. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుపై మాట్లాడనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ …

Read More »

వారందరికీ నోటీసులు పంపుతోన్న ఐటీ శాఖ.. రూ.6 లక్షలు దాటితే అంతే..!

Remittance: మీరు విదేశాలకు డబ్బులు పంపిస్తున్నారా? ట్యాక్స్ తప్పించుకునేందుకు అడ్డదారులు అనుసరిస్తే మీకు నోటీసులు రావచ్చు. తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 6 లక్షలు ఆపైన ఫారెన్ రెమిటెన్స్ (విదేశీ చెల్లింపులు) ట్రాన్సక్షన్లపై సమగ్ర పరిశీలన చేయనుంది. విదేశాలకు రూ. 6 లక్షలకు మించి డబ్బులు పంపిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టనుంది. ఫారెన్ రెమిటెన్స్‌లో ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారని ఐటీ శాఖ దృష్టికి వచ్చిన క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత …

Read More »

మంత్రి నారా లోకేష్ పేరుతో డబ్బుల కావాలని మెసేజ్.. పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోటోతో గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేసే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు లోకేష్ ఫోటోను వాట్సాప్‌ ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకుని డబ్బులు అడుగుతున్నారని టీడీపీ నేత బెజవాడ నజీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఓ మొబైల్ వాట్సాప్‌కు మంత్రి నారా లోకేష్ ప్రొఫైల్ పిక్‌గా ఉంది.. శుక్రవారం విజయవాడలోని పటమటకు చెందిన ఆర్‌.వేణుకు ఆ వాట్సాప్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌లో తనను నారా …

Read More »

ఐటీ ఉద్యోగులకు అలర్ట్..అటెండెన్స్‌తో లీవ్స్‌కి లింక్

IT Employees: దేశీయ మూడో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతి కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ (HCL Tech) మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆఫీసు అటెండెన్స్‌తో సెలవులకు లింక్ పెట్టింది. అంటే ఆఫీసుకు వచ్చిన వారికి మాత్రమే లీవ్స్ ఉంటాయి. ఆఫీసుకు రాని వారికి శాలరీలో కోత పడనుంది. ఈ మేరకు ఈ విషయానికి సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు మనీకంట్రోలో ఓ కథనం ప్రచురించింది. ఆ వివరాలు తెలుసుకుందాం. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత …

Read More »