Tag Archives: karnataka

కర్ణాటక సీఎంపై ఈడీ కేసు.. సిద్ధరామయ్య భార్య సంచలన నిర్ణయం

ముడా భూముల (MUDA Scam) వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి బీఎన్ పార్వతి (BN Parvathi) కీలక ప్రకటన చేశారు. తమకు ముడా పరిధిలో కేటాయించిన స్థలాలను తిరిగి అప్పగించేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 స్థలాలను తిరిగి ముడాకు ఇచ్చేస్తున్నట్లు పార్వతి వెల్లడించారు. అంతేకాదు, ముడా భూముల వ్యవహారంలో వస్తోన్న అన్ని ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని …

Read More »

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు.. ముడా స్కామ్‌లో అరెస్ట్ తప్పదా!

MUDA Case: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ-ముడా భూముల కుంభకోణం.. కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో స్వయంగా సీఎం సిద్ధరామయ్యపైనే కేసు నమోదు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ముడా కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యను తాజాగా ఈ కేసులో నిందితుడిగా లోకాయుక్త పేర్కొంది. ఈ కేసులో ఏ1గా సిద్ధరామయ్య పేరును ఎఫ్ఐఆర్‌లో పేరు నమోదు చేశారు. సిద్ధరామయ్యతోపాటు ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామితోపాటు మరో వ్యక్తి పేరును నిందితుల జాబితాలో చేర్చింది. ఈ …

Read More »

తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం వేళ కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం

తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని, జంతువుల కొవ్వు ఉపయోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాలకు కేవలం …

Read More »

గాడిద పాల పేరుతో రైతులకు కుచ్చు టోపీ.. రూ.9 కోట్లు దోచేసిన ఏపీకి చెందిన సంస్థ

గాడిద పాల వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంస్థ నిండా ముంచేసింది. మొత్తం 200 మంది సామాన్య రైతుల నుంచి ఏకంగా రూ.9 కోట్లు దండుకుంది. చివరకు ఇది బోగస్ అని తేలడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి.. మూడు నెలల కిందట ‘జెన్ని మిల్క్‌’ అనే పేరుతో ఓ సంస్థ ఏర్పాటుచేశాడు. హొసపేటెలోని హంపీ రోడ్డులో హంగూ ఆర్భాటాలతో దీనిని ప్రారంభించి.. ఉద్యోగులను నియమించుకున్నాడు. గాడిద పాల వ్యాపారం చేస్తే లక్షాధికారులు …

Read More »

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు అరెస్ట్ తప్పదా.. కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశం?

Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ముడా భూముల కేటాయింపు వ్యవహారం ప్రస్తుతం.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చులా బిగుసుకుంటుండటంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో సీఎంపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడంతో.. సిద్ధరామయ్యను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్య.. కర్ణాటక కేబినెట్‌ను అత్యవసరంగా భేటీకి పిలవడం ప్రస్తుతం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే ముడా కుంభకోణం వ్యవహారంలో సీఎంపై విచారణకు అనుమతించడంతో …

Read More »

మందుబాబులుకు గుడ్‌న్యూస్.. ఇక అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం అమ్మకాలు

Bar And Restaurants: కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాల సమయాన్ని మరికొన్ని గంటలు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మందుబాబులకు శుభవార్త చెప్పింది. బడ్జెట్ రెవెన్యూ లోటును భర్తీ చేసుకునేందుకు.. మద్యం విక్రయాలు పెంచాలని సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం మద్యం విక్రయాల సమయాన్ని పెంచడంతో.. అమ్మకాలు పెరిగి.. ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించుకునేందుకు వ్యాపారులకు …

Read More »

మటన్‌ పేరుతో కుక్క మాంసం సరఫరా ఆరోపణలు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Mutton: నాన్ వెజ్ ప్రియులు మాంసాన్ని ఇష్టంగా తింటారు. అలాగే ఓ కుటుంబం కూడా మటన్ తెచ్చుకుని తిన్నారు. ఆ కుటుంబంలోని నలుగురు సభ్యులు మాంసం తిని.. ఆ తర్వాత అందులో ఇద్దరు తమ పనులకు వెళ్లిపోయారు. అయితే వాంతులు, విరేచనాలు కావడంతో వారు తిరిగి ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇంట్లో ఉన్న ఇద్దరు కూడా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలోనే వారు చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం …

Read More »