Tag Archives: krishna

విజయవాడకు చెందిన బ్యాంకు లైసెన్స్ రద్దు.. RBI షాకింగ్ ప్రకటన.. ఖాతాదార్ల పరిస్థితి ఏమిటి?

RBI: నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో దివాలా అంచుకు చేరుకుని ఆదాయ మార్గాలు లేని వాటి లైసెన్సులనూ రద్దు చేస్తోంది. తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ప్రముఖ కో ఆపరేటివ్ బ్యాంక్ అయిన దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్సును ఆర్‌బీఐ రద్దు చేసింది. ఈ బ్యాంకు తగిన మూలధనాన్ని నిర్వహించడం లేదని, ఆదాయ మార్గాలు లేకపోవడం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్ట 1949 నిబంధనలు …

Read More »

ఏపీలో యువతకు బంపరాఫర్.. టెన్త్ పాసైనా, ఫెయిలైనా ఫుడ్ పెట్టి ఉచితంగా.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యువతకు బంపరాఫర్ ప్రకటించింది. ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో.. బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్‌ బైర్డ్‌ సహకారంతో సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. యువకుల కోసం ఎయిర్‌ కండిషనర్‌, కూలర్‌, రిఫ్రిజిరేటర్‌ మెకానిజమ్‌పై ఉచిత వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని రాజీవ్‌నగర్‌లోని భారత వికాస్‌ పరిషత్‌ భవనంలో అతి త్వరలో ఈ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎన్టీఆర్‌ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. పదో …

Read More »

విజయవాడలో వెరైటీ దొంగ.. ఆ టైంలో మాత్రమే చోరీలు, రాత్రిళ్లు మాత్రం!

విజయవాడలో ఓ దొంగ ఆట కట్టించారు పోలీసులు. కొద్దిరోజులుగా నగరంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. మనోడి గురించి ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మనోడు రాత్రిళ్లు చోరీలు చేయడం.. దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి.. మనోడి ట్రాక్ రికార్డ్ చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. మహంతిపురంకు చెందిన షేక్ షబ్బీర్‌బాబు చెడు వ్యసనాలకు బానిసగా మారాడు.. జల్సాల కోసం డబ్బులు కావాలి.. అందుకే విజయవాడలో దొంగతనాలు మొదలుపెట్టాడు. దీని కోసం ముందుగానే ఓ ప్లాన్ వేసుకుంటాడు. విజయవాడలో పగటి …

Read More »

వరద బాధితులకు డ్రోన్లతో ఆహారం సరఫరా.. పరిశీలించిన సీఎం చంద్రబాబు

ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వరదలు పోటెత్తడంతో ఎక్కడి జనం అక్కడే చిక్కుకుపోయారు. ఇక ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో.. సామాన్లు మొత్తం నీళ్లలో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే జనం అంతా ఇళ్లపైకి ఎక్కి.. ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ చేయడమే కాకుండా ఆహారం, తాగునీరు సరఫరా చేస్తోంది. అయితే హెలికాప్టర్లు అన్ని ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం ఉండకపోవడంతో టెక్నాలజీని వాడాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే డ్రోన్ల ద్వారా …

Read More »

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. అత్యవసరమైతే ఈ రూట్‌లో వెళ్లండి

విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.భారీ వర్షాలు, వరదల కారణంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అలాగే చిల్లకల్లు, నందిగామ దగ్గర జాతీయ రహదారి మీదకు నీళ్లు వచ్చాయి. పాలేరు నది పొంగడం, సూర్యాపేట తర్వాత రామాపురం క్రాస్‌రోడ్డు బ్రిడ్జి కూలడంతో.. ప్రజల భద్రతా కారణాల రీత్యా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా వెళ్లాల్సి …

Read More »

ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు.. ఘాట్ రోడ్డు మూసివేత, ఏడుగురు మృతి

Vijayawada Rains: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక పలు ప్రాంతాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరం మొత్తం అతలాకుతలం అవుతోంది. రెండు రోజులుగా ముసురు వానలు కురుస్తుండగా.. శనివారం ఉదయం నుంచి భారీగా వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరం మొత్తం వరదతో నిండిపోయింది. ప్రధాన రహదారులు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఇక ప్రముఖ ఇంద్రకీలాద్రి గుట్టపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై ఉన్న ప్రోటోకాల్ రూమ్‌పై భారీ బండరాళ్లు విరిగిపడటంతో అది …

Read More »