కర్నూలులో బంపరాఫర్ ఇచ్చారు.. రూ.100కే చికెన్ అన్నారు. ఇంకేముంది జనాలు అక్కడికి క్యూ కట్టారు.. దెబ్బకు రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నగరంలోని మద్దూర్ నగర్‌లో షమీర్ చికెన్ సెంటర్, సుభాన్ మటన్ చికెన్ సెంటర్‌లు ఉన్నాయి. వీరిద్దరు ఒకరిపై మరొకరు పోటీపడి కిలో చికెన్ ధర రూ.100కు తగ్గించారు. దీంతో జనాలు చికెన్ కొనేందుకు షాపుల దగ్గర బారులు తీరారు. ఈ ఆఫర్ ఏమో కానీ వాహనాల రాకపోకలకు రెండు గంటలకు పైగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు కలగ జేసుకొని …
Read More »Tag Archives: Kurnool
కర్నూలు జిల్లా ప్రజలకు ఊరట.. ఆ పనులు వెంటనే ఆపాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో యురేనియం తవ్వకాలకు బ్రేక్ పడింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను ఆపేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. యురేనియం లభ్యత, పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు తెలిపారు. ఇకపై అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగవు అన్నారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి జిల్లాకు చెందిన మంత్రి టీజీ …
Read More »శ్రీశైలం మల్లన్నకు భారీగా ఆదాయం.. హుండీలో విదేశీ కరెన్సీ.. బంగారం, ఎన్ని కోట్లంటే!
శ్రీశైలం మల్లన్నకు హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. శుక్రవారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. శ్రీశైలం ప్రధాన ఆలయంలోని చంద్రావతి కల్యాణమండపంలో భక్తులు గత 29 రోజులుగా సమర్పించిన ఈ హుండీ లెక్కింపును నిర్వహించారు. హుండీ ద్వారా దేవస్థానానికి రూ.3,31,70,665 నగదు లభించింది. అలాగే 127 గ్రాముల బంగారం, 4.400 కిలోల వెండి ఉన్నాయి. 4,445 యూఏఈ దిర్హమ్స్, 489 అమెరికా డాలర్లు, 5 లక్షల విలువైన వియత్నాం డాంగ్స్, 108 ఖతార్ రియాల్స్, 90 థాయిలాండ్ …
Read More »