Tag Archives: metro

హైదరాబాద్‌‌లో అండర్‌ గ్రౌండ్ మెట్రో, 20 స్టేషన్లు.. ఆ రూట్‌లో డబుల్ డెక్కర్, సర్కార్ కీలక నిర్ణయం..!

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రజారవాణా సౌకర్యాలను మరింత అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణను చేపట్టింది. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్కార్.. మొత్తంగా ఆరు కారిడార్లతో 116.4 కిలో మీటర్ల విస్తరించేందుకు ఇప్పటికే ప్రణాళిక రచించారు. ఇప్పటికే ఐదు కారిడార్ల డీపీఆర్‌ సిద్ధం చేసి కేంద్రానికి కూడా పంపించారు. ఐదు కొత్త కారిడర్లలో నాగోల్- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, రాయదుర్గ్- కోకాపేట్, ఎంజీబీఎస్‌-చంద్రాయణగుట్ట, మియాపూర్- పటాన్‌చెరు, ఎల్బీనగర్‌- హయత్‌నగర్ …

Read More »

విదేశంలో మెట్రో రైళ్లు నడపనున్న హైదరాబాద్ మహిళా లోకో పైలట్ ఇందిర.. హ్యాట్సాఫ్

హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ ఇందిరా ఈగలపాటి.. సౌది అరేబియా రాజధాని రియాద్‌లో సత్తా చాటనున్నారు. రియాద్‌లో త్వరలో ప్రారంభం కానున్న మెట్రో రైళ్లను నడపనున్నారు. రియాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను 2025 జనవరిలో ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యుత్తమ మెట్రో రైలు వ్యవస్థల్లో ఒకటిగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం చెబుతోంది. లోకో పైలట్ ఇందిరా ఈగలపాటి.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేశారు. మెట్రో రైళ్లను నడపడం, స్టేషన్ల …

Read More »

హైదరాబాద్‌ మెట్రో సెకండ్ ఫేజ్.. కేబినెట్ కీలక నిర్ణయం, ఇక ఆ ప్రాంతాలకు ట్రైన్ ప్రయాణం

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 3 కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉండగా.. రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు తమ రాకపోకలు సాగిస్తున్నారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు తక్కువ సమయంలో, సౌకర్యవంతంగా చేరుకునేందుకు చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానికి సిద్ధమైంది. తాజాగా.. హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదించింది. నాగోల్ – …

Read More »