Tag Archives: MLC Kavitha

క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్.. కవితపై చర్యలకు సిద్ధమవుతోందా?

బీఆర్ఎస్‌లో తీవ్రమైన కుదుపులు. ఓ వైపు కాళేశ్వరంపై విచారణ పేరుతో బయటి నుంచి ఒత్తిడి పెంచే పరిణామాలు. మరోవైపు పార్టీలో కవిత నుంచి ఎదురవుతున్న ధిక్కార స్వరాలు. ఇంతకాలం కేసీఆర్‌కు కుటుంబమే బలం అనుకున్న పరిస్థితి నుంచి.. ఇప్పుడు ఆ కుటుంబమే బీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్న పరిస్థితి. కేటీఆర్, హరీష్‌రావు, కవిత, సంతోష్‌రావు. వీరంతా కేసీఆర్ కుటుంబసభ్యులు. కారు లాంటి బీఆర్ఎస్ పార్టీకి నాలుగు చక్రాల్లాంటివారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తరువాత అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలో ఎలాంటి కుదుపులు లేకుండా చూసేందుకు ఎవరి …

Read More »

కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావుది కీలక పాత్ర.. వారిద్దరి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు.. కవిత సంచలన ఆరోపణలు..

కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే హరీశ్‌ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించినట్లు తెలిపారు. హరీశ్, సంతోష్ వల్లేనే కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటుకున్నాయని అన్నారు. వాళ్ల స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారన్నారు. వారిద్దరి వెనక సీఎం రేవంత్ ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరపడం దారుణమన్నారు. దమ్ముంటే హరీష్‌, సంతోష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాపై కుట్రలు చేసినా సహించా.. కానీ కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నానని …

Read More »

బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్‌ సరైనదే… బీఆర్‌ఎస్‌ వాళ్లు నా దారికి రావాల్సిందే: చిట్‌చాట్‌లో కవిత

ఎమ్మెల్సీ కవిత చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్‌ సరైనదేనని వెనకేసుకొచ్చారు. ఆర్డినెన్స్‌ వద్దని బీఆర్ఎస్‌ నేతలు చెప్పడం తప్పు అంటూ సొంత పార్టీనే విమర్శించారు కవిత. నిపుణులతో చర్చించాకే ఆర్డినెన్స్‌కు మద్దతిచ్చానని చెప్పారు కవిత. BRS వాళ్లు నా దారికి రావాల్సిందేనని అన్నారు. తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదుని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్.. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తోన్న అంశమిది. …

Read More »

బోనాల సంబరాలు షురూ.. గోల్కొండ జగదాంబికకి తొలి బోనం సమర్పణ..క్యూ కట్టిన రాజకీయ నేతలు, భక్తులు

తెలంగాణలో బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్‌ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి.. సల్లంగా చూడమని వేడుకుంటారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది కూడా బోనాల సంబురం మొదలు కాగా.. వచ్చే నెల 24న ముగుస్తాయి. బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆలయ అర్చకులు తొలి బోనం సమర్పించారు. బోనాల జాతర ప్రారంభం నేపథ్యంలో తొలి …

Read More »