ఏప్రిల్ 22వ తేదిన హత్యకు గురైన టిడీపీ నేత వీరయ్య చౌదరి హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రకాశంజిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలులో తన కార్యాలయంలో ఉండగా ఆయన ప్రత్యర్ధులు కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించారు. బాపట్ల పార్లమెంట్ టిడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ముప్పవరపు వీరయ్య చౌదరిని దుండగులు కత్తులతో పాశవికంగా పొడిచి పొడిచి చంపారు. కేవలం మూడు నిమిషాల వ్యవధిలో 53 సార్లు కర్కశంగా కత్తులతో పొడిచారు. దీంతో వీరయ్య చౌదరి అక్కడిక్కడే చనిపోయారు. …
Read More »