Tag Archives: new posts

వైఎస్ జగన్ కొత్త స్ట్రాటజీ.. వైసీపీలో కీలక మార్పులు, వాళ్లందరికి పదవులు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో మార్పులు, చేర్పులు మొదలుపెట్టారు. అన్ని జిల్లాలకు కొత్తగా అధ్యక్షుల్ని నియమిస్తున్నారు.. తాజాగా మరో మూడు జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులను మార్చారు. విశాఖపట్నం జిల్లాకు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లికి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును అధ్యక్షులుగా నియమించారు. 2024 ఎన్నికల ముందు పంచకర్ల రమేష్‌బాబు‌ పార్టీని వీడటంతో.. విశాఖపట్నం జిల్లాకు …

Read More »