పారిస్ 2024 ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అదనపు బరువు కారణంగా ఫైనల్ బౌట్‌కు ముందు అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వినేష్ ఫొగాట్ చేసిన అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) తిరస్కరించింది. దీంతో తాను పాల్గొన్న మూడో ఒలింపిక్స్‌లోనూ వినేష్ ఫొగాట్ పతకం లేకుండానే వెనుదిరిగినట్లయింది. దీంతో భారత్ ఏడో పతకం సాధిస్తుందని ఉన్న ఆశలు ఆడియాశలయ్యాయి. ఆరు పతకాలతోనే భారత్ పారిస్ …
Read More »Tag Archives: Paris Olympics
పారిస్ ఫైనల్ మెడల్స్ లిస్ట్.. టాప్‌లో అమెరికా, భారత్ కంటే మెరుగైన స్థానంలో పాకిస్థాన్..!
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. మొత్తంగా సుమారు రెండు వారాల పాటు సాగిన ఈ పోటీలు క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి. అయితే భారత ఫ్యాన్స్‌కు మాత్రం మిశ్రమ అనుభూతులను అందించాయి. మను భాకర్ తొలి మెడల్ సాధించి జోష్ నింపింది. అయితే బ్యాడ్మింటన్, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు నిరాశ పరిచారు. మరికొందరు పతకాన్ని తృటిలో చేజార్చుకున్నారు. మొత్తంగా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలు సాధించింది. అయితే పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనాకు చోటు …
Read More »వినేశ్ ఫోగట్ అంశంపై చర్చకు నిరాకరణ.. పార్లమెంట్ నుంచి విపక్షాలు వాకౌట్
ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత అంశంపై చర్చించాలని రాజ్యసభలో విపక్ష ఇండియా కూటమి నేతలు పట్టుబట్టాయి. ఇందుకు ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నిరాకరించడంతో విపక్షాలు వాకౌట్ చేశారు. వినేశ్ ఫోగట్ తాను పోటీ పడిన 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరుకోగా.. తుదిపోరుకు కొద్ది గంటల ముందే నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉందనే కారణంతో అనర్హురాలిగా ప్రకటించడంతో యావత్తు దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఒలింపిక్ నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు ప్రధాని నరేంద్ర మోదీ.. …
Read More »రాత్రికి రాత్రే బరువు ఎలా పెరిగింది? లక్షల్లో జీతం తీసుకునే కోచ్‌లు ఏం చేస్తున్నారు?
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఫైనల్ చేరిన వినేష్ ఫొగాట్ స్వర్ణ పతకం సాధిస్తుందని అంతా భావించారు. 50 కేజీల మహిళ రెజ్లింగ్ విభాగంలో పాల్గొన్న ఆమె ఫైనల్ మ్యాచ్‌కు ముందు కొన్ని గ్రాముల బరువు ఎక్కువ ఉన్నట్లు ఒలింపిక్ కమిటీ గుర్తించింది. దీంతో ఆమె ఫైనల్ ఆడకుండా అనర్హత వేటు విధించింది. దీంతో 140 కోట్ల మంది భారతీయులు నిరుత్సాహానికి గురయ్యారు. భారత క్రీడాలోకం మొత్తం వినేష్ ఫొగాట్‌కు మద్దతు ప్రకటించారు. రౌండ్ 16, క్వారర్స్, సెమీఫైనల్ మ్యాచ్‌లకు ముందు వినేష్ ఫొగాట్ బరువు …
Read More »ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్.. వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు, పతకం లేకుండానే!
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. సెమీ ఫైనల్‌లో గెలిచి నాలుగో పతకం ఖాయం చేసిన వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. దీంతో పతకం ఖాయమనుకున్న భారత్‌కు షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు బరువు కొలవగా.. 50 కేజీల కంటే సుమారు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. వాస్తవానికి మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల ఫైనల్ …
Read More »పారిస్ ఒలింపిక్స్‌లో బీజేపీ మహిళా ఎమ్మెల్యే..
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా మొదలయ్యాయి. అయితే తొలిరోజు భారత క్రీడాకారులు నిరాశపరిచారు. ఈ క్రమంలోనే పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన వారిలో ఓ బీజేపీ మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆమెనే బీహార్‌కు చెందిన శ్రేయాసీ సింగ్. బీహార్ 2020 ఎన్నికల్లో జముయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయాసీ సింగ్.. భారత షూటింగ్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్‌కు ఎన్నికయ్యారు. పారిస్ ఒలింపిక్స్ కోసం వెళ్లిన 117 మంది భారతీయ క్రీడాకారుల్లో శ్రేయాసీ సింగ్ కూడా ఒకరు కావడం గమనార్హం. అయితే షూటింగ్ …
Read More »Paris Olympics 2024: పారిస్ సంబరం.. ఘనంగా ఆరంభం..
పారిస్ 2024 ఒలింపిక్స్‌కు అధికారికంగా తెరలేచింది. ఒలింపిక్ చరిత్రలో తొలిసారి నదిలో జరిగిన ఈ సంబురాలు.. చూపరులను ఆకట్టుకున్నాయి. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అంబరాన్ని తాకాయి. చారిత్రక సీన్ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో నిర్వహించింది. గతంలో ఎప్పుడైనా ప్రారంభ వేడుకలు స్టేడియంలో జరిగేవి.. కానీ పాత పద్దతికి స్వస్తి పలుకుతూ సెన్ నదిపై వేడుకలను ఘనంగా నిర్వహించింది ఫ్రాన్స్. విశ్వక్రీడల …
Read More »నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్.. చరిత్రలో నిలిచిపోనున్న ప్రారంభ వేడుకలు..!
ప్రపంచ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ దేశాల్ని ఒక్కచోటకు చేర్చి ఆటలాడించే అద్భుత ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. నేడు పారిస్ వేదికగా ఒలింపింక్స్ 2024కు తెరలేవనుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడల్లో నేటి నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. చివరగా పారిస్‌లో 1924లో ఒలింపిక్స్ జరిగాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి అక్కడ పోటీలు జరగనున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో నిలిచిపోనున్న వేడుకలు.. సాధారణంగా ఎప్పుడైనా ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు ఆతిథ్య నగరంలోని ప్రధాన స్టేడియంలో జరుగుతాయి. …
Read More »