Tag Archives: Piyush Goyal

ఏపీ ప్రభుత్వ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య – పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దు

ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ కృష్ణపట్నం పర్యటన రద్దైంది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత, దానిలో సాంకేతిక లోపం బయటపడింది. దీంతో పీయూష్ గోయల్‌ పర్యటనను తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. ఈ పరిణామంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి సహా వీవీఐపీలు వినియోగించే హెలికాప్టర్లలో సాంకేతిక, భద్రతా సమస్యలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని డీజీపీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇకపై అసలు ఆ హెలికాప్టర్‌ వాడొచ్చా లేదో వివరణ ఇవ్వాలన్నారు.

Read More »