ప్రధాని మోదీ.. సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళ్ళి శిబు సోరెన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిబు సోరెన్ కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులను ప్రధాని మోదీ ఓదార్చారు.. ఈ మేరకు మోదీ ఎక్స్ లో ఫొటోలను షేర్ చేశారు. జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కన్నుమూశారు.. అనారోగ్య సమస్యలతో గత కొంత కాలం నుంచి ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న …
Read More »Tag Archives: pm modi
ఇవాళ ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ… బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ ప్రధాని మోదీతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై మోదీతో చర్చించే ఛాన్స్ ఉంది. ప్రధానితో భేటీ అనంతరంర ఆయన సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక సంస్థలతో పాటుగా, విద్యా ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కేంద్రానికి కూడా పంపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రిజర్వేషన్లను పెంచుకునేందుకు …
Read More »9 నెలలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. రికార్డు స్థాయికి భారత్..!
ప్రపంచంలో అత్యధిక ఫారెక్స్ నిల్వలు కలిగిన నాల్గవ దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ మాత్రమే భారతదేశం కంటే ముందు ఉన్నాయి. భారతదేశ కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు, భారతదేశ విదేశీ కరెన్సీ ఆస్తులు భారీగా పెరిగాయి. భారతదేశం గత 9 నెలలుగా ఎదురుచూస్తున్న రోజు చివరకు రానే వచ్చింది. అక్టోబర్ 2024 తర్వాత మొదటిసారిగా, దేశ ఫారెక్స్ నిల్వలు 700 బిలియన్ డాలర్లను దాటాయి. జీవితకాల గరిష్ట రికార్డును బద్దలు …
Read More »8 రోజులు, 5 దేశాలు.. దశాబ్దంలోనే సుదీర్ఘ విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ..
భారత ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల సుదీర్ఘ పర్యటనకు బయలుదేరనున్నారు. గత దశాబ్ద కాలంలో మోడీ చేస్తున్న అత్యంత సుదీర్ఘమైన విదేశీ పర్యటన ఇది. ఈ పర్యటనలో ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ముఖ్యంగా బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం ఈ పర్యటనలోని ప్రధాన ఉద్దేశ్యం. గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, రక్షణ, శక్తి రంగాల్లో సహకారాన్ని …
Read More »ఆ దేశ ప్రధానికి వెండి కొవ్వొత్తి స్టాండ్‌ను ఇచ్చిన ప్రధాని మోదీ..! ఎందుకంటే..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రొయేషియా పర్యటనలో ఉన్నారు. క్రొయేషియాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రొయేషియా అధ్యక్షుడు, ప్రధానమంత్రికి సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన విలువైన హస్తకళలను బహుమతిగా ఇచ్చారు. క్రొయేషియా అధ్యక్షుడికి ఒడిశా నుండి పట్టచిత్ర పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. రాజస్థాన్ నుండి వెండి కొవ్వొత్తి స్టాండ్‌ను ప్రధానమంత్రికి బహుమతిగా ఇచ్చారు. రాష్ట్రపతికి ‘పట్టచిత్ర పెయింటింగ్’ క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్ కు ఒడిశా నుంచి వచ్చిన సాంప్రదాయ పట్టచిత్ర పెయింటింగ్ ను ప్రధాని మోదీ …
Read More »కెనడా కేంద్రంగా భారత్‌పై ఖలిస్థానీ ఉగ్రవాదుల కుట్రలు! CSIS సంచలన రిపోర్ట్
కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) తాజా నివేదికలో కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదులు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలు, నిధుల సేకరణ, ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడించింది. ఇది భారతదేశం ఎప్పటినుంచో లేవనెత్తుతున్న ఆందోళనలను ధృవీకరిస్తుంది. కెనడా ప్రభుత్వం “ఉగ్రవాదం” అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించడం ఇదే మొదటిసారి.కెనడా ప్రధాన నిఘా సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) సంచలన సమాచారం బయటపెట్టింది. ఖలిస్తానీ తీవ్రవాదులు ప్రధానంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, నిధుల సేకరణకు, ప్రణాళిక వేయడానికి కెనడాను …
Read More »పాక్‌తో కాల్పుల విరమణ.. ట్రంప్‌నకు గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ!
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. జమ్ముకశ్మీర్ విషయంలో ఎవరి జోక్యమూ అనవసరమని స్పష్టం చేశారు. ట్రంప్ తో 35 నిమిషాల ఫోన్ కాల్ లో ఈ విషయాన్ని వివరించారు. పాకిస్తాన్ తో కాల్పుల విరమణపై నేరుగా చర్చలు జరిగాయని కూడా తెలిపారు.భారత్-పాక్ మధ్య యుద్ధం ఆపింది నేనే అంటూ పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి మోదీకి గట్టి డోస్ ఇచ్చారు. “మీకు అంత సీన్ లేదు” అని అర్థం వచ్చేలా క్లాస్ తీసుకున్నంత పనిచేశారు. మీ …
Read More »మే 2న అమరావతికి ప్రధాని మోదీ.. రాజధాని పునః నిర్మాణ పనులకు శ్రీకారం..
తెలుగు ప్రజలందరూ ఎప్పటినుంచో ఉత్కంఠగా ఎదురు చూసే సమయం రానే వచ్చింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విచ్చేయనున్నారు. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఓ కీలక మలుపుగా నిలవనుంది. ఎందుకంటే, చాలా కాలంగా ఎదురుచూస్తున్న అమరావతి పునఃనిర్మాణ పనులకు మోదీ స్వయంగా శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ పర్యటన నిర్ధారణ కాగానే ముఖ్యమంత్రి కార్యాలయం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పర్యటనపై మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించి, …
Read More »అమెరికా-భారత్ బంధం మరింత బలోపేతం కావాలి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
అమెరికాలోని వైట్ హౌస్‌లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ భేటి అయ్యారు. యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు విదేశాంగమంత్రి జైశంకర్, NSA అజిత్ దోవల్ పాల్గొన్నారు.అమెరికాలోని వైట్ హౌస్‌లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ భేటి అయ్యారు. యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశం కావడం …
Read More »ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకం.. ప్రతిపక్షహోదా కావాలంటే 10శాతం సీట్లు దక్కాల్సిందే
ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని.. తాజాగా ఢిల్లీ ప్రజలు కూడా మోదీ నాయకత్వాన్ని బలపరిచారని చెప్పారు. ప్యాలెస్‌ల విషయంలోనూ ఏపీ, ఢిల్లీకి పోలికలు ఉన్నాయని.. రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నా.. ఢిల్లీలో శీష్ మహల్ కట్టుకున్నా.. వాటిలోకి అడుగుపెట్టలేకపోయారన్నారు.కొందరు నాయకుల సంక్షేమం ముసుగులో రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు… ఏపీ, ఢిల్లీకి ఈ అంశంలో పలు పోలికలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ విజయం …
Read More »