ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూ్ర్తి నాయుడు (72) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు.. నవంబర్ 14వ తేదీ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. నారా రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిర, ఇద్దరు కుమారులు …
Read More »