ఒక్కరు.. ఒకే ఒక్కరు తప్పా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. కడియం శ్రీహరి మినహా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి కూడా హాజరయ్యారన్న సమాచారంతో అసలేం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై …
Read More »Tag Archives: revanth reddy
మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాస్ రియాక్షన్..
ఎవరో వెనక నేనెందుకు ఉంటాను.. నేను ఎవరి వెనుక ఉండను.. ఉంటే ముందే ఉంటాను.. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక నేనెందుకు ఉంటాను.. నాకు అంత సమయంలేదు.. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. అంటూ కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గతంలో వేరేవాళ్లను ఎదగనీయనివాళ్లు.. ఇప్పుడు పంచాయితీలు పెట్టుకుంటున్నారు.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారు.. ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారు.. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ.. అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గొప్ప …
Read More »దేశవ్యాప్తంగా తెలుగు వెలగాలంటే సుదర్శన్ రెడ్డి గెలవాలి.. సీఎం రేవంత్ కీలక కామెంట్స్
నీలం సంజీవరెడ్డి , పీవీ నరసింహరావు, జైపాల్ రెడ్డి ,వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ వంటి తెలుగు నేతలు గతంలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు మరోసారి తెలుగు వ్యక్తికి జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిందని.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎజెండా, జెండా లేకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంతా మద్దతివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండో …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో మరో డిస్కం ఏర్పాటు!
ఇంధనశాఖపై సమీక్షలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ శాఖ ప్రక్షాళన కోసం సంస్కరణలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌తో పాటు కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. విద్యుత్ విభాగం ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ ఉండగా.. …
Read More »హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
తెలంగాణ రవాణా రంగ అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి తుది లొకేషన్ సర్వే పూర్తి అయింది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే, రాష్ట్ర రాజధానిని చుట్టూ కొత్త రైల్వే మార్గం ఏర్పడనుండగా, ఇది దేశంలోనే వినూత్న ప్రయత్నంగా నిలవనుంది. ఔటర్ రింగ్ రైలు మార్గం ప్రధానంగా సికింద్రాబాద్‌ను అనుసంధానించే ఆరు రైలు కారిడార్లతో కలిపి రూపొందించనున్నారు. వాటిలో సికింద్రాబాద్–కాజీపేట, వాడి, డోన్, ముర్కడ్, గుంటూరు, కొత్తపల్లి మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలతో అనుసంధానం వల్ల రైల్వే రాకపోకలపై …
Read More »రైతు నేస్తం.. మరో సభకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..
కాంగ్రెస్ సర్కార్ మరో సభకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందించిన రైతు భరోసాపై.. ప్రభుత్వ విజయాన్ని ప్రజల మధ్య పంచుకునేందుకు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో “రైతు భరోసా విజయోత్సవ సభ” నిర్వహించనున్నట్టు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు …
Read More »తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది..? అప్పుడే మొదలైన పవర్ పాలిటిక్స్..
తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది? అధికారంలోకి వచ్చేది ఎవరు? నేతలు మాత్రం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు. మళ్లీ సీఎం అయ్యేది తానే అని రేవంత్ అంటుంటే.. కేసీఆర్ సీఎం కావడం చారిత్రక అవసరమని గులాబీ పార్టీ అంటోంది. పవర్ గేమ్‌లో రెండు పార్టీల డైలాగ్ వార్ హాట్ టాపిక్‌గా మారింది.తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది? అధికారంలోకి వచ్చేది ఎవరు? నేతలు మాత్రం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు. మళ్లీ సీఎం అయ్యేది తానే అని రేవంత్ అంటుంటే.. కేసీఆర్ సీఎం …
Read More »అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు..? తెలుగు రాష్ట్రాల సీఎంలు ఫైర్..
ప్రజల పక్షాన పనిచేసేందుకు అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు దండగ అంటున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారని చంద్రబాబు, స్పీకర్ విమర్శిస్తే..తెలంగాణలో కేసీఆర్ తీరును ఎండగట్టారు సీఎం రేవంత్. ఆ వివరాలు ఇలా..ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులు.. వారుకూడా ఒకవిధంగా ప్రభుత్వ ఉద్యోగులే.. ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రతి నెలా జీత భత్యాలు తీసుకునే వారు ఎన్నుకున్న ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే ఎలా? అనే ప్రశ్న అసెంబ్లీలో లేవనెత్తారు సీఎం చంద్రబాబు, …
Read More »కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం తెలిపామా..? తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన సీఎం చంద్రబాబు
తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కృష్ణానది, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుందంటూ తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము అభ్యంతరం తెలిపలేదని.. వృధా నీటిని ఉపయోగించుకుంటున్నామని వివరించారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదం తారాస్థాయికి చేరింది.. కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందంటూ తెలంగాణ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి …
Read More »రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. మొదట కొత్త రేషన్ కార్డులు అందేది ఆ జిల్లాల వారికే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీకి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కొత్త దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు, పాత కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసిన వారికి కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు కోటి రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నది. కొత్తగా అందించనున్న రేషన్ కార్డులు పోస్ట్‌కార్డు సైజులో ఉండేలా రూపొందిస్తున్నారు. కార్డుపై ప్రభుత్వ లోగోతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు ఉండే అవకాశం …
Read More »