బ్యాంక్ మేనేజ్మెంట్ డీప్ ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో ప్రచారం అవుతోన్న వివిధ స్కీముల ప్రకటనలపై ఎస్పీఐ స్పందించింది. ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించింది. ఇలాంటి ప్రకటనలను ఎస్బీఐ ఎప్పుడూ చేయదని స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ప్రకటనను విడుదల చేసింది..దేశంలో రోజురోజుకూ ఆన్లైన్ మోసాలు వేగంగా పెరిగిపోతున్నాయి. కొత్త టెక్నాలజీని ఉపయోగించి ప్రజలను మోసగిస్తున్నారు. బ్యాంకుల పేర్లు చెప్పుకుని లేదా డిజిటల్ అరెస్టులంటూ అమాయకుల నుంచి లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెరుగుతున్నందున …
Read More »