ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సింహాచలం ఆలయానికి ఊరట దక్కింది. గత పదిహేనేళ్లుగా ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకొని న్యాయవివాదంలో ఉండిపోయిన సింహాచలం దేవస్థానానికి చెందిన భూములు హైకోర్టు తీర్పుతో తిరిగి దక్కాయి. ఈ భూముల విలువ ఏకంగా సుమారు రూ.650 కోట్లని చెబుతున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సింహాచలం ఆలయ అధికారులకు ఈ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో సింహాచలం దేవస్థానం అనుబంధంగా కాశీవిశ్వేశ్వరస్వామి కోవెల ఉంది. ఈ ఆలయానికి సర్వే నంబర్లు 3/1, 3/4లలో 99.20 …
Read More »Tag Archives: simhachalam
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలో ఇక్కడ కూడా, ఇకపై ఈజీగా
సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో దిగ్విజయంగా కొనసాగుతున్న నిత్య అన్నప్రసాద పథకానికి విరాళాలు సమర్పించాలనుకునే భక్తులకు డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. సింహాద్రి అప్పన్న స్వామి నిత్యాన్నప్రసాద పథకం 35వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అన్నప్రసాద పథకానికి సాధారణ భక్తులు సైతం విరాళాలు సమర్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. సింహాచలం ఆలయం అన్నదానం భవనం దగ్గర కార్డు స్వైపింగ్ పరికరాలు, డిజిటల్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్‌లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఈవో. …
Read More »సింహాచలంలో నేడు గిరి ప్రదక్షిణ మహోత్సవం
సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీనృసింహ స్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో శనివారం గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభం కానుంది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశినాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన తొలి పావంచా వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకువజామున సింహాద్రినాథుడికి తుది విడత చందన సమర్పణ చేస్తారు.
Read More »