తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసు సోమవారం ట్విస్ట్ తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పానుగంటి చైతన్య సోమవారం కోర్టులో లొంగిపోయారు. మంగళగిరి కోర్టులో పానుగంటి చైతన్య లొంగిపోయారు. ప్రస్తుతం పానుగంటి చైతన్య వైసీపీ విద్యార్థి విభాగం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2021 అక్టోబర్లో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై కొంతమంది దాడి చేశారు. రాళ్లు, కర్రలతో టీడీపీ కేంద్ర కార్యాలయం అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ కేసులో పానుగంటి చైతన్య ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal