Tag Archives: Teacher

Nisha Madhulika: ఆమె వంటలకు కోట్లలో వీక్షకులు.. కాలక్షేపానికి మొదలెట్టి రిచెస్ట్ మహిళా యూట్యూబర్‌గా..!

Nisha Madhulika: అభిరుచి అవసరంతో పెనవేసుకున్నప్పుడు అది జీవితాలను మార్చే, వృత్తిని సృష్టించే ఒక ఆయుధంగా మారుతుంది. అది సామ్రాజ్యాలను సృష్టించే శక్తిని కలిగి ఉంటుంది. వంటపై ఉన్న మక్కువ ఒక టీచర్‌ను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. కాలక్షేపం కోసం మొదలు పెట్టి ఇప్పుడు ఎందరికో శిక్షణ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లింది. 65 ఏళ్ల వయసులో అత్యంత ధనిక భారతీయ మహిళా యూట్యూబర్‌గా మార్చింది. ఆమెనే యూట్యూబ్‌లో సంచలనంగా మారిన నిషా మధులిక. ఆమె గురించి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. …

Read More »

ఈ టీచర్ మహా ముదురు.. ఏకంగా రూ.6.70కోట్లు, మనోడి గురించి తెలిస్తే!

ప్రకాశం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘనకార్యం ఆలస్యంగా బయటపడింది.. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ తోటి ఉద్యోగుల్ని, జనాల్ని నిండా ముంచేశారు. ఉన్నట్టుండి ఆయన కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది.. తీరా ఆరా తీస్తే ఆయన చేతిలో మోసపోయినట్లు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేస్తవారపేటకు చెందిన కిషోర్‌కుమార్‌.. కొత్త మల్లాపురం ప్రాథమిక పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్ (ప్రభుత్వ ఉపాధ్యాయుడి)గా పనిచేస్తున్నారు. ఆయన తోటి ఉపాధ్యాయులు, స్థానికులు, వ్యాపారుల్ని.. చీటిపాటలు, ప్లాట్ల వ్యాపారం పేరుతో మాయ మాటలు చెప్పి మోసం చేశారు. కిషోర్ కుమార్ మెడికల్‌ …

Read More »

ఏపీలో టీచర్‌గా పనిచేసిన ఢిల్లీకి కాబోయే సీఎం ఆతిశీ.. ఆ ఫేమస్ స్కూల్ ఎక్కడుందంటే!

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ మార్లేనా ఎన్నికయ్యారు.. త్వరలోనే ఆమె బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలతో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలైన కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ సీఎం కాబోతున్న అతిశీ గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి.. ఆమె ఏపీలో టీచర్‌గా పనిచేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని కురబలకోట మండలం రిషివ్యాలీ స్కూల్‌ ఉంది. గతంలో ఆతిశీ ఆ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా …

Read More »

విద్యార్థులను భుజాన ఎక్కించుకుని వరద ప్రవాహాన్ని దాటించిన మాస్టారు

ఉపాధ్యాయుడంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న విషయాలను బోధించటమే కాదు.. విద్యార్థులకు మంచి చెడుల వ్యత్యాసాన్ని నేర్పించి.. మంచి మార్గాన్ని చూపించటం కూడా. అవసరమైతే.. చేయి పట్టుకుని ఆ మార్గం వెంట నడిపించి గమ్యం చేరేలా చేయటం కూడా గురువు బాధ్యతే. అచ్చంగా అదే పని చేశాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థులను తమతమ జీవితాల్లో గమ్యాలను చేర్పించటం ప్రస్తుత కాలంతో కొంచెం కష్టమైన విషయమే కానీ.. అడ్డుగా నిలిచిన వరద ప్రవాహాన్ని సురక్షితంగా దాటించి గమ్యస్థానాలకు చేర్చి.. మా మంచి మాస్టారు అనిపించుకున్నాడు. కుమురం భీం …

Read More »