కాకతీయ హాస్టల్‌లో విద్యార్థి మృతిపై నిరసనగా..నిజామాబాద్‌లో ఆందోళనకు సిద్ధమయ్యాయి విద్యార్థి సంఘాలు. కాకతీయ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.నిజామాబాద్ నగరంలోని కాకతీయ స్కూల్‌లో గుడాల శివజశ్విత్ రెడ్డి(14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి శుక్రవారం(నవంబర్ 29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్వల్ప అస్వస్థతకు గురైన శివజశ్విత్ రక్తపు వాంతులతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. అయితే తల్లిదండ్రులకు అలస్యంగా సమాచారం ఇవ్వడంతో అనుమానం వ్యక్తమైంది. దీంతో తమ కుమారుడి మరణం సహాజ మరణం కాదని, …
Read More »Tag Archives: telagana
తెలంగాణ నుంచి మరో ఐఏఎస్‌కు ఏపీలో పోస్టింగ్.. కీలక బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్ ఇచ్చింది.. ఈ మేరకు సీఎస్ నీరబ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి వచ్చిన రోనాల్డ్ రోస్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను ఆర్థికశాఖ కార్యదర్శి (బడ్జెట్ నిర్వహణ, ఇన్‌స్టిట్యూషనల్ ఫైనాన్స్)గా నియమించింది. అలాగే సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న కె.కన్నబాబుకు.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అలాగే ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న బి.అనిల్‌కుమార్‌రెడ్డిని …
Read More »హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్.. కేబినెట్ కీలక నిర్ణయం, ఇక ఆ ప్రాంతాలకు ట్రైన్ ప్రయాణం
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 3 కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉండగా.. రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు తమ రాకపోకలు సాగిస్తున్నారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు తక్కువ సమయంలో, సౌకర్యవంతంగా చేరుకునేందుకు చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానికి సిద్ధమైంది. తాజాగా.. హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదించింది. నాగోల్ – …
Read More »హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది.. 200 మీటర్ల దూరంలోనే..!
హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. గోషామహల్‌లో దారుసలామ్ నుంచి చాక్నావాడికి వెళ్లే మార్గంలో ప్లైవుడ్ దుకాణాల ముందు రోడ్డు భారీగా కుంగిపోయింది. రోడ్డు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కుప్పకూలిపోయింది. అయితే.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరుగుతుండటంతో.. అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సీవరేజ్ పెద్ద నాలా అతిపూరాతనమైనదని స్థానికులు చెప్తున్నారు. అయితే.. ప్రస్తుతం …
Read More »నేను కూడా పంపిస్తా.. కాచుకో.. కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్ స్పందన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపించిన నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ తనకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశానని తెలిపిన బండి సంజయ్.. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తనపై మొదట కేటీఆరే వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించినట్టు పేర్కొన్నారు సంజయ్. అందుకు బదులుగానే తాను మాట్లాడినట్టు తెలిపారు. “కేటీఆర్ సుద్దపూస అనుకుంటున్నాడేమో. ఆయన భాగోతం ప్రజలకు …
Read More »