నిజాం ఆస్తులు కొట్టేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవరాలు ప్రిన్సెస్ ఫాతిమా ఫౌజియా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వారుసులుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆస్తులు కొట్టేసేందుకు కుట్రపన్నారంటూ నగర సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండో కుమారుడు హైనస్ వాల్షన్ ప్రిన్స్ మౌజ్జమ్ ఝా బహదూర్ కుమార్తె ఫాతిమా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే 2016లో నాంపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాము ఏడో నిజాం …
Read More »Tag Archives: Telanagan
బీఆర్ఎస్కు హైకోర్టులో చుక్కెదురు.. పార్టీ ఆఫీస్ కూల్చేయాలని ఆదేశం
బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో షాక్ తగిలింది. నల్గొండ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పార్టీ నాయకులే కార్యాలయానికి కూల్చివేయాలని.. లేదంటే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చేశారని హెచ్చరించింది. పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసేలా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆఫీస్ నిర్మాణం చేయకముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కదా..? అని ప్రశ్నించింది. పార్టీ ఆఫీసు నిర్మించిన తర్వాత ఎలా అనుమతి ఇస్తారని పిటిషనర్‌ను …
Read More »తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్
తెలంగాణను వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించటం లేదు. గత 10 రోజులకు పైగా.. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయితే నేడు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. …
Read More »