ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. గత మంత్రివర్గ నిర్ణయాలపై సమీక్షించడం ఈ భేటీ ప్రధాన అజెండాగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 18 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. ఈ భేటీల్లో 327 నిర్ణయాలు తీసుకున్నారు. వీటిల్లో ఎన్ని అమలయ్యాయి.. ఎన్ని నిలిచిపోయాయి అనే దానిపై మెయిన్‌గా ఫోకస్ పెట్టనుంది కేబినెట్. ఆలస్యమైన నిర్ణయానికి బాధ్యులెవరు? అమలులో ఎందుకు జాప్యం జరుగుతోంది.. అసలు కార్యాచరణ మొదలుపెట్టారా లేదా.. ఇలా అన్ని విషయాలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మంత్రి దగ్గర నుంచి …
Read More »