Tag Archives: Telangana

కొండగట్టు అంజన్న సన్నిదిలో ఇదేం దరిద్రపు పని.. అది కూడా అన్నసత్రంలో.. సీసీకెమెరాల్లో రికార్డు..!

Kondagattu Anjaneya Swamy Temple: తెలంగాణలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నిత్యం ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. మరో వార్త ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. కొండగట్టు అంజన్న సన్నిధిలో దొంగతనం జరిగింది. అది కూడా ఆలయ నిత్య అన్నదాన సత్రంలో ఈ చోరీ జరింది. ఈ నెల 9న.. బియ్యం బస్తాలు, ఇతర వస్తువులు ఎత్తుకుపోయారు. ఈ విషయంలో సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అసలు ఈ చోరీ …

Read More »

కిన్నెర మొగులయ్యకు అన్యాయం.. రాత్రికిరాత్రే కూల్చివేత.. సర్కార్ ఇచ్చిన 15 రోజులకే..!

పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు ఊహించని పరిణామం ఎదురైంది. కిన్నెర మొగులయ్యను ఆర్థికంగా ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్.. ఇటీవలే (సెప్టెంబర్ 24న) హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో 600 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే.. ఆ భూమి పట్టాను మొగులయ్యకు అందించారు. దీంతో.. ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని భావించిన మొగులయ్య.. మొదట తన సొంత ఖర్చుతో చదును చేసుకుని చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటుచేసుకున్నాడు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ.. రాత్రికి రాత్రే ఆ కాంపౌండ్ వాల్‌ను ఎవరో …

Read More »

చెరువుల్లో 386 ఎకరాలు మాయం!

హైదరాబాద్‌ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో అంతులేని ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేకించి గడిచిన పదేళ్లకాలంలో అత్యధికంగా చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు మొత్తం 695 చెరువులు ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతుండగా.. ఇందులో 2014 నుంచి 2023 మధ్య కాలంలోనే 44 చెరువులు పూర్తిగా కబ్జాలకు గురై కనుమరుగయ్యాయి. మరో 127 చెరువుల్లో పెద్ద మొత్తం విస్తీర్ణం ఆక్రమణల పాలైంది. మొత్తంగా ఆయా చెరువులన్నింట్లో కలిపి గత పదేళ్లలో 386.71 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు తేల్చారు. వీటిలో …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైడ్రా కూల్చివేతలు నిలుపుదల..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పటికే వందల ఇండ్లను నేలమట్టం చేశారు. కొందరు పేదల ఇండ్లతో పాటుగా బడాబాబుల ఖరీదైన విల్లాలను సైతం బుల్డోజర్ల సాయంతో కూల్చేశారు. అయితే ఈ కూల్చివేతలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల అమీన్‌పూర్, పటేల్‌గూడ ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టగా.. బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం …

Read More »

తెలంగాణ ప్రజలకు సర్కార్ దసరా కానుక.. పండుగకు ఒక రోజు ముందే.. మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో ప్రతిష్టాత్మక కార్యక్రమంవైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపికబురు వినిపించారు. తెలంగాణలో విద్యార్థులకు మెరుగైన విద్యా అందించటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే.. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ పైలెట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మధిరలో క్యాంపస్‌లు నిర్మిస్తున్నారు. ఆ తర్వాత.. అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే.. ఆదివారం …

Read More »

బతుకమ్మకు అమెరికాలో అధికారిక గుర్తింపు.. ‘తెలంగాణ హెరిటేజ్ వీక్‌’ పేరుతో సంబురాలు

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సూచిక.. తెలంగాణకు మాత్రమే సొంతమైన పూల కేళిక.. బతుకమ్మ పండుగ. పూలను పూజించే అత్యంత అరుదైన సంబురం బతుకమ్మ. ప్రకృతిలోనే పరమాత్మున్ని చూసుకుని.. పూలనే గౌరమ్మగా భావించి.. చేసుకునే తొమ్మిదిరోజుల మహా ఉత్సవం బతుకమ్మ. అలాంటి బతుకమ్మ పండుగకు అరుదైన గుర్తింపు లభించింది. బతుకమ్మ సంబుర ప్రాశస్త్యాన్ని, పండగలోని పరమార్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించాయి. అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు.. బతుకమ్మ పండుగకు అధికారికంగా గుర్తించాయి. అంతేకాదు.. బతుకమ్మ సంబరాల వారాన్ని.. బతుకమ్మ …

Read More »

దసరాకు ఊరెళుతున్నారా.. ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి మొదలవుతోంది.. ఈ నెల 2 నుంచి విద్యా సంస్థలకు దసరా సెలవులు మొదలుకాబోతున్నాయి. అయితే దసరా పండుగకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. ఈ క్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దసరాకు సొంతూళ్లకు వచ్చి వెళ్లే వారి కోసం అదనంగా 6,100 ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది ఆర్టీసీ. ఈ బస్సుల్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి రాష్ట్రానికి వచ్చేవాళ్ల కోసం.. రాష్ట్రంలో ఓ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే వారి రద్దీని దృష్టిలో ఉంచుకొని …

Read More »

ఐఐటీ, నీట్‌లాంటి ప్రఖ్యాత సంస్థల్లో చదివి.. సాఫ్ట్‌వేర్ జాబ్‌లు కాదని.. ఏఈఈ ఉద్యోగాలకు మొగ్గు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. కార్పొరేట్ సెక్టార్‌లో ఐదంకెల జీతం.. హైఫై లైఫ్.. వారంలో రెండ్రోజులు హాలీడే, విదేశీ ట్రిప్పులు ఇలా చాలా సౌకర్యాలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ఉంటాయి. దీంతో చాలా మంది యువత బీటెక్‌లు చదివి సాఫ్ట్‌వేర్ రంగం వైపు మెుగ్గుచూపుతారు. గత పదేళ్లుగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సాఫ్ట్‌వేర్ రంగంపై వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. అయితే ప్రస్తుతం సీన్ మారుతోంది. కోట్ల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటే.. సెక్యూరిటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగాల వైపు యువత …

Read More »

తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు.. అక్టోబర్ 3 నుంచే, వాటితో పని లేదు

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, ఫ్యామిలీ డిజిటల్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల కార్డుల మంజూరుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ హెల్త్ కార్డుల విషయమై.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపై ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అధికారులకు సూచించారు. కుటుంబంలోని సభ్యుల పేర్లు, …

Read More »

తెలంగాణకు భారీ వర్ష సూచన.. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లోనూ గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని 14 రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో గురువారం భారీ …

Read More »