రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల కబ్జాలను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులను అంటించారు. మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో తెలిపారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు.. అందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. రంగారెడ్డి …
Read More »Tag Archives: Telangana
అన్నకు రాఖీ కట్టిన చెల్లి.. కవితను చూసి కన్నీళ్లు పెట్టుకున్న తల్లి.. భావోద్వేగ దృశ్యాలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి.. ఐదున్నర నెలల తర్వాత బెయిల్ మీద విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. నివాసానికి చేరుకున్న కవితను చూసి.. తన తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనై.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత.. కుటుంబ సభ్యులందరి సమక్షంలో తన అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టారు. దీంతో.. కవిత ఇంట్లో భావోద్వేగ దృశ్యాలు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More »జీతం కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే.. ఉద్యోగం నుంచి తీసేశారు..!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ‘ప్రజావాణి’ కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే సీఎం రేవంత్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజాభవన్‌కు వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు మెుర పెట్టుకుంటున్నారు. ఇలాగే ఓ మహిళా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని కూడా తన జీతం విషయంపై ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే జీతం విషయం దేవుడెరుగు ఉద్యోగమే తీసేశారని సదరు మహిళ వాపోయింది …
Read More »చిన్నారులతో నిండిపోయిన ఆస్పత్రులు.. బెడ్లు లేక తీవ్ర ఇబ్బందులు
వర్షాకాలం నేపథ్యంలో.. తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు సీజన్ వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో.. చిన్నారులతో ఆస్పత్రులు నిండిపోయాయి. ఏ ఆస్పత్రి చూసినా.. చిన్నపిల్లలతో వార్డులన్ని నిండిపోయాయి. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి అయిన నీలోఫర్ హాస్పిటల్‌లోని.. ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక పిల్లల తల్లిదండ్రుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓకే బెడ్డుపై ముగ్గురు నలుగురు పిల్లలను వైద్యులు పడుకోబెట్టి వైద్యం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఒకరి జబ్బు ఇంకొకరికి వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం …
Read More »మార్కెట్‌లోకి కొత్త వైరస్.. తెలంగాణ సర్కార్ అలెర్ట్.. హైదరాబాద్‌లో ఆస్పత్రులు సిద్ధం..!
Monkeypox alert: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే మానవాళి కోలుకుంటున్న నేపథ్యంలో.. మరో కొత్త వైరస్ (మంకీపాక్స్) వణికిస్తోంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా ఈ కొత్త వైరస్ వ్యాపిస్తోంది. మిగతా దేశాలకు కూడా అంతేవేగంగా విస్తరిస్తోంది. ఈ మంకీపాక్స్ (ఎంపాక్స్)పై అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మంకీపాక్స్ వైరస్ మన దేశంలోకి రాకుండా అడ్డుకోవటమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు …
Read More »‘అందుకు మీ సలహాలు కావాలి’.. CPM నేతలను రిక్వెస్ట్ చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నామన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీపీఎం నేతలు రాఘవులు, జూలకంటి రంగారెడ్డిలతో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వ్యక్తిగత పనుల నిమిత్తం రాఘవులు సెక్రటేరియట్‌కు వెళ్లగా.. అక్కడే ఉన్న సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి వారిని రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రేవంత్ సీపీఎం నేతలకు వివరించారు. ఇటీవలె రూ. 2 లక్షల …
Read More »అర్హులైనా రుణమాఫీ కాలేదా..? గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల పంట రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. జులై 18న తొలి విడతలో రూ. లక్షలోపు, జులై 31న రెండో విడతలో రూ. లక్షన్నర లోపు.. ఆగస్టు 31న మూడో విడతలో రూ.లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేశారు. అయితే చాలా మంది రైతులకు అర్హులైనప్పటికీ రుణమాఫీ సొమ్ము జమ కాలేదు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రుణమాఫీ …
Read More »జీవితాంతం ఉచిత బస్సు ప్రయాణం.. ఆ చిన్నారికి ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్, నర్సుకు కూడా..!
రాఖీ పౌర్ణమి రోజున గద్వాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఆ చిన్నారి జీవిత కాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ అందిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్‌ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిఫ్ట్‌గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. …
Read More »వర్షాల వేళ స్కూళ్లకు సెలవులు.. కలెక్టర్లకు మంత్రి కీలక ఆదేశాలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో వారం రోజుల పాటు కూడా ఇలాగే కుండపోత వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా వచ్చే నాలుగైదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో.. పలు జిల్లాలకు ఎల్లో, రెడ్ అలర్టులను ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి, జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …
Read More »నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వానపడుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అబ్దుల్లాపూర్‌మేట్, జీడిమెట్ల, సూరారం, అబిడ్స్, నాంపల్లి, నాగోల్, అంబర్ పేట్, సుచిత్ర, బషీర్ బాగ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్, దిల్‌సుఖ్ నగర్, మలక్ పేట, షేక్ పేట, మెహదీపట్నం, వనస్థలిపురం, ఉప్పల్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఎర్రమంజిల్, లక్డికాపుల్, ఫిల్మ్ నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ …
Read More »