Tag Archives: TGPSC Group 1 Issue

హైకోర్టు గ్రూప్ 1 తీర్పుపై డివిజ‌న్ బెంచ్‌కు టీజీపీఎస్సీ.. నిరుద్యోగుల్లో గందరగోళం

తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల ఫలితాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. జవాబు పత్రాలను పునర్‌ మూల్యాంకనం చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు రీవాల్యూయేషన్‌ చేస్తే సాంకేతిక సమస్యలు రావొచ్చని టీజీపీఎస్సీ అభిప్రాయపడుతుంది. గ్రూప్‌ 1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్‌లు జారీ చేశారు. …

Read More »