రాఖీ పౌర్ణమి రోజున గద్వాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఆ చిన్నారి జీవిత కాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ అందిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్‌ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిఫ్ట్‌గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. …
Read More »