పాలమూరు జిల్లాలోని సప్త కొండలు నెలరోజుల పాటు గోవిందనామస్మరణతో మారుమోగనున్నాయి. జిల్లా ప్రజల ఇలవేల్పు దైవం కురుమూర్తిస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏడు కొండల మధ్య లక్ష్మి సమేతంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలో స్వయంభవుగా వెలిసిన స్వామివారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లానుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, …
Read More »