తిరుమల తిరుపతి దేశస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ.రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. రాజశేఖర్ బాబు టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఈవో శ్యామలరావు అతన్ను సస్పెండ్ చేశారు. కాగా తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన రాజశేఖర్ టీటీడీలో ఏఈవోగా పనిచేస్తున్నారు. అయితే ఇతను ప్రతీ ఆదివారం స్థానికంగా ఉన్న చర్చిలో ప్రార్థనలు చేసేందుకు వెళ్తున్నారని.. అక్కడ ప్రార్థనల్లో పాల్గొంటున్నారని స్థానిక భక్తల నుంచి టీడీకి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన …
Read More »Tag Archives: ttd
సార్.. ముఖం చూసి అమాయకుడు అనుకునేరు..! శ్రీవారి సన్నిధిలో నృత్య ప్రదర్శన పేరిట చేతివాటం!
శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన చోట నృత్య ప్రదర్శనంటే మామూలు విషయమా మరి.. అది కూడా తిరుమల ఆస్థాన మండపంలో నృత్యం చేసే ఛాన్స్ దొరికితే అంతకన్నా ఇంకేం భాగ్యం. కళాకారుల కోరికనే తెలంగాణకు చెందిన ఒక మోసగాడికి ఆదాయ వనరైంది. అక్రమంగా వసూలు చేసేందుకు అవకాశం కల్పించింది. తిరుమలలో నృత్య ప్రదర్శనలు ఇప్పిస్తానంటూ కళాకారులను అడ్డంగా దోచేసేందుకు మార్గమైంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సూత్రపు అభిషేక్ ఈ మేరకు ప్లాన్ పక్కాగా అమలు చేశాడు. అయితే అడ్డంగా దొరికి పోయాక …
Read More »ఏ సీజన్లో దొరికే పండ్లతో ఆ సీజన్లో వెంకన్నకు అలంకారం.. భక్తులకు ప్రత్యేక సందేశం..
కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి. భక్తులు ఈయన్ను పరిపరి విధాలుగా కొలుస్తుంటారు. తిరుమల తిరుపతి నుంచి ద్వారకాతిరుమల వెంకన్న , వాడపల్లి శ్రీనివాసుడు ఇలా ప్రాంతం స్థలం ఏదైనా భక్తుల సేవలు , పూజలు ఆయా ఆలయాల్లో ఘనంగా జరుగుతుంటాయి. సాధారణం ఆలయ , ఆగమ శాస్త్రాల ప్రకారం పూజాదికాలు , అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ఏ సీజన్ లో దొరికే పండ్లు ఆ సీజన్ లో శ్రీవారికి సమర్పిస్తారు భక్తులు ఎందుకంటే..వెంకన్న కొలువు తీరిన ఆలయాల్లో తూర్పు గోదావరి జిల్లా అన్నవరపుపాడు గ్రామం ఒకటి. …
Read More »దేశంలోని ప్రతీ రాష్ట్ర రాజధానిలో తిరుపతి వెంకన్న ఆలయం! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఈ మేరకు దిశానిర్దేశం చేస్తామన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకరించినట్లయితే ఈ ప్రాజెక్టు అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలని, శ్రీవారి ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని ఆదేశించారు.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకన్న ఆలయాల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా …
Read More »తిరుమలలో ప్రతి టీటీడీ ఉద్యోగికి ఉద్యోగికి నేమ్ బ్యాడ్జ్.. భక్తుల కోసం కీలక నిర్ణయం
Tirumala Name Badge System: టీటీడీ ఉద్యోగులకు సంబంధించి ఛైర్మన్ బీఆర్ నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. తిరుమలకు వచ్చే భక్తులతో కొందరు టీటీడీ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఉద్యోగులు భక్తుల విషయంలో బాధ్యతగా ఉండాలన్నారు. ఈ మేరకు ఈ సరికొత్త నిర్ణయంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ …
Read More »తిరుమలలో రీల్స్, వీడియో షూట్స్‌పై టీటీడీ కీలక నిర్ణయం
తిరుమలలో రీల్స్, వీడియో షూట్స్ వ్యవహారంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించింది. ఎప్పటికప్పుడు నిఘా ఉండేలా విజిలెన్స్ స్పెషల్ ఫోకస్ పెడుతోంది.తిరుమలలో ఇటీవల తరచూ వివాదాలు తెరపైకి వస్తున్నాయి. శ్రీవారి ఆలయం సమీపంలో కొందరు చేస్తున్న హడావిడితో చాలామంది భక్తులు ఇబ్బందిపడుతున్నారు. టీటీడీ నిబంధనల్ని పట్టించుకోకుండా ఫోటో షూట్‌లు చేస్తున్న ఘటనలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. దాంతో.. తిరుమలలో రీల్స్, వీడియో షూట్స్‌పై టీటీడీ నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. …
Read More »మూడు నెలల్లో తిరుమలలో ఆ సమస్యకు చెక్.. టీటీడీ ఈవో హామీ
టీటీడీ ఈవో జె. శ్యామలరావు తిరుమలలో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును టీటీడీ ఈవో తొలుత పరిశీలించారు. దశాబ్దాల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తిరుమలలో 30 ఏళ్ల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్న టీటీడీ ఈవో శ్యామలరావు.. దీని వలన అనేక …
Read More »TTD Board Decisions: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. మూడు గంటల్లోనే దర్శనం!
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. కొంతమంది కాలినడకన తిరుమలకు చేరుకుంటే.. మరికొంతమంది భక్తులు వాహనాల్లో తిరుమల కొండకు చేరుకుంటారు. ఇక శ్రీవారి దర్శనం కూడా పలు రకాలు. సర్వ దర్శనం, దివ్య దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇలా పలు రకాలు. అయితే సామాన్యులు ఎక్కువగా సర్వదర్శనానికే ప్రాధాన్యమిస్తుంటారు. అయితే రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సర్వ దర్శనానికి వెళ్లే భక్తులు గంటల తరబడి కంపార్ట్‌మెంట్లలో వేచి చూడాల్సి ఉంటుంది. పండుగ రోజుల్లో అయితే ఇది మరింత …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు బుక్ చేస్కోండి
తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 ఫిబ్రవరి నెల కోటాను ఇవాళ (నవంబర్ 18న) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము …
Read More »ఏపీలోని ఆ ఆలయంలో ఇకపై పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి లేదు.. టీటీడీ కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్‌లో రాములోరు కొలువైన ఒంటిమిట్ట కోదండ రామాలయానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇకపై ఒంటిమిట్ట రామాలయంలో వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వొద్దని.. పెళ్లిలు జరగనీయకుండా ఆపేయాలని భారత పురాతత్త్వ-సర్వేక్షణశాఖ అధికారులు మౌఖిక ఆంక్షలు విధించారు. ఈ మేరకు టీటీడీ శుపరిపాలన యంత్రాంగానికి మొబైల్‌లో కాల్ చేసి ఆదేశించారు. పెళ్లిళ్లకు అనుమతులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో భక్తులు అవాక్కయ్యారు. ఈ నిర్ణయం సరికాదని.. వెంటనే వెనక్కు తీసుకోవాలంటున్నారు. ఇది వాస్తవమేనని.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్. ఒంటిమిట్ట కోదండ …
Read More »