గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం వంశీ శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుండటంతో.. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వంశీ ఉదయం కోర్టుకు హాజరైన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, వల్లభనేని వంశీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని.. …
Read More »Tag Archives: Vallabhaneni Vamsi
జైలులో వల్లభనేని వంశీని పరామర్శించిన వైఎస్ జగన్..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వైఎస్ జగన్ జైలు వద్దకు వస్తుండటంతో వైఎస్సార్‌సీపీ నేతలు భారీగా తరలి వస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వంశీని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు..విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీని పరామర్శించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. ములాఖత్‌లో వైఎస్ జగన్ వంశీని కలిశారు. జరిగిన పరిణామాల గురించి జగన్ వంశీని అడిగి తెలుసుకుంటున్నారు. కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ములాఖత్‌కు పేర్నినాని, కొడాలి …
Read More »వంశీ కేసులో దర్యాప్తు ముమ్మురం చేసిన పోలీసులు
– లెక్కలన్నీ తేలుస్తాం…! అందరిని బయటకు తీస్తాం..! అంటూ వల్లభనేని వంశీ కేసులో దూసుకుపోతున్నారు పోలీసులు. ఓవైపు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్… మరోవైపు వంశీ అనుచరుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. అలాగే కస్టడీ కోరుతూ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కర్మ సిద్ధాంతం అంటూ పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతోంది.వల్లభనేని వంశీ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్‌కు ఇప్పటికే కోర్టు 14 రోజలపాటు రిమాండ్ విధించడంతో… వారిని కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు రాబట్టొచ్చన్న …
Read More »కృష్ణలంక పీఎస్‌లో కొనసాగుతున్న క్వశ్చన్ అవర్.. వంశీపై ప్రశ్నల వర్షం
గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్.. ఇటీవల విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయ స్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. అయితే…కృష్ణలంకలో క్వశ్చన్ అవర్ కంటిన్యూ అవుతోంది. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నాలుగు గంటలకు పైగా విచారిస్తున్నారు పోలీసులు. ఎందుకు…? ఏమిటి…? ఎలా…? అంటూ …
Read More »మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే.. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రావాల్సి ఉంది..గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై BNS సెక్షన్ …
Read More »