రోడ్డు ప్రమాదాల నివారణపై విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు ట్రాఫిక్ పోలీసులు. దానిలో భాగంగా.. విజయవాడ సిటీలో కొద్దిరోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సిటీ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ హెల్మెట్ వాడకుంటే జరిమానా విధించడంతోపాటు.. వాహనాలు సీజ్ చేస్తున్నారు. పనిలో పనిగా హెల్మెట్ వినియోగంతోపాటు పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపైనా కొరఢా ఝుళిపిస్తున్నారు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు. విజయవాడ సిటీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అప్పటికప్పుడు పెండింగ్ చలాన్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. …
Read More »