Tag Archives: visakhapatnam

గంజాయికి అవకాడోతో చెక్.. ఎకరాలో పండిస్తే ఇంత లాభమా? ఐడియా అదిరింది గురూ

మన్యం ప్రాంతాలలో ఎక్కువగా ఇబ్బందులు పెట్టే సమస్యలు.. ఒకటి మావోయిస్టులు.. రెండు గంజాయి. ఇక విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా సహా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయిని అక్రమంగా సాగు చేస్తుంటారు. పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేస్తున్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు, అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అయితే ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం గంజాయి మహమ్మారిని అరికట్టడానికి కీలక చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే గంజాయి సాగు నుంచి మన్యం ప్రాంతాల వాసులను మళ్లించేందుకు …

Read More »

చెన్నై టు విశాఖపట్నం వయా సికింద్రాబాద్.. ఆ బ్యాగు అక్కడికి చేరింది, ఆ దొంగ మంచి చేసినట్లేనా!

చెన్నై టు సికింద్రాబాద్ ఏంటి.. బ్యాగు విశాఖకు చేరడం ఏంటి అనుకుంటున్నారా?.. అవును సినిమా రేంజ్‌లో ఓ స్టోరీ జరిగింది. ఓ ఉద్యోగికి సంబంధించి బ్యాగు కహానీ ఇది. చెన్నైలో మొదలై సికింద్రాబాద్ మీదుగా విశాఖపట్నానికి చేరింది. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన కార్తికేయన్‌కు హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. ఈనెల 8న యువకుడు ఉద్యోగంలో చేరేందుకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో కాట్పాడి నుంచి సికింద్రాబాద్‌ బయలుదేరాడు. రైలులో కార్తికేయన్‌ నిద్రలోకి జారుకున్నారు.. ఆ తర్వాత కొంతసేపటికి లేచి చూస్తే అతడి బ్యాగు మాయమైంది. నిద్రలేచిన కార్తికేయన్‌.. …

Read More »

విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. డైనో పార్కులో మంటలు

విశాఖ నగరంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్ రోడ్డులోని డైనో పార్క్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉదయం వేళ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో ఆస్తినష్టం ఎంత మేర జరిగిందన్నది తెలియాల్సి ఉంది.బీచ్‌ రోడ్డులో జీవీఎంసీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకొని కొందరు వ్యక్తులు ఈ డైనో పార్క్ రెస్టో కేఫ్‌ని నిర్వహిస్తున్నారు. కేఫ్ మొత్తం వెదురు బొంగులతో నిర్మించడంతో …

Read More »

ఏపీలో మరోసారి ఎన్నికలు.. ఆగస్టు 30న పోలింగ్, మూడు జిల్లాల్లో కోడ్ అమల్లోకి

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్‌సీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్‌ గెలిచారు. అయితే ఆయన జనసేన పార్టీలో చేరగా.. అనంతరం అనర్హత వేటు వేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ వచ్చిందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలవుతుంది.. …

Read More »

విశాఖలో యువకుడికి మ్యాట్రీమోనీ మోసం

యువకులు మ్యాట్రీమోనీలో పెళ్లి సంబంధాల కోసం చూస్తుంటారు. తమకు నచ్చిన అమ్మాయి కోసం రిక్వెస్ట్‌లు పంపుతుంటారు. అవతలి వైపు నుంచి అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సంబంధం సెట్టు.. అయితే మ్యాట్రీమోనీ రిక్వెస్ట్‌లు, అమ్మాయిల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చిక్కులు తప్పవు. అమ్మాయి అందంగా ఉంది కదా అని టెంప్ట్ అయితే నిండా మునిగిపోయినట్లే.. అందుకే మ్యాట్రీమోనీ విషయంలో జాగ్రత్తలు తప్పవు మరి. తాజాగా విశాఖపట్నంలో అదే జరిగింది.. ఓ యువకుడు మ్యాట్రీమోనీలోకి వెళ్లి ఓ మహిళ చేతిలో మోసపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో …

Read More »

కేంద్ర బడ్జెట్‌లో విశాఖకు తీపి కబురు.. భారీగా నిధులు, పూర్తి వివరాలివే

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు జరిగాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలే కాకుండా.. ఇతర ప్రయోజనాలు కూడా కలగనున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కలిగే అదనపు ప్రయోజనాల వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్రం విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు బడ్జెట్‌లో రూ.620 కోట్లు కేటాయించగా.. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.63 కోట్లు తగ్గింది. అలాగే విశాఖలో ఏర్పాటుచేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎనర్జీకి రూ.168 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.78 కోట్లు పెంచడం …

Read More »

సింహాచలంలో నేడు గిరి ప్రదక్షిణ మహోత్సవం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీనృసింహ స్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో శనివారం గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభం కానుంది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశినాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన తొలి పావంచా వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకువజామున సింహాద్రినాథుడికి తుది విడత చందన సమర్పణ చేస్తారు.

Read More »