Tag Archives: Weather Report

మరో పిడుగు లాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ఈ వారాంతంలో మరో అల్పపీడనం

రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో పలు జిల్లాల్లో భారీవానలు కురవొచ్చని తెలిపింది. కోనసీమలో ఇప్పటికే వర్షాల కారణంగా లంక గ్రామాల ప్రజలు వరద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల వద్ద వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. …

Read More »

ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణ ఇలా.. ఈ జిల్లాలకు ఉరుములతో వర్షం

ఆంధ్రప్రదేశ్ వాతావరణ విశేషాలు ఎలా ఉండబోతున్నాయ్. అల్పపీడన ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయ్. వచ్చే 3 రోజుల వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేద్దాం. ఈ స్టోరీ చూసేయండి మరి. ఇదిగో వర్షాలు ఇలా ఉంటాయి ఇలా. ఉత్తర ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాలలోని నిన్నటి అల్పపీడనం ఈరోజు, సెప్టెంబర్ 04, 2025న ఉదయం 0830 గంటలకు IST సమయానికి పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మది గా కదులుతూ, ఉత్తర ఛత్తీస్‌గఢ్ దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా వ్యాపించింది. …

Read More »

ఏపీ ప్రజలారా వినండి..! ఈ జిల్లాలకు భారీ వర్షాలు.. వచ్చే 3 రోజులు దుమ్ముదుమారం

ఏపీ, తెలంగాణకు వర్షసూచన కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి మరి. బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా.. ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే.. ఏపీలోని మూడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. …

Read More »

బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాలపై వరుణుడి తాండవం

వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే.? పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటికి అనగా మంగళవారం నాటికీ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ …

Read More »

ఆహా.! ఎంతటి చల్లటి కబురు చెప్పారండీ.. వచ్చే 3 రోజుల ఏపీలో వాతావరణం ఇలా..

ద్రోణి ప్రభావంతో అటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి వచ్చే 2 రోజుల్లో ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి ఈ స్టోరీ తెలుసుకుందామా. ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 & 5.8 కి.మీ మధ్య కొనసాగుతోంది, ఇది ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపుకు వంగి ఉంది.దీని ప్రభావంతో, రాబోయే 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. …

Read More »

ఆహా.! ఎంత చల్లచల్లని కబురు.. ఉరుములతో భారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే

కాస్కోండి… ఇక వానలే వానలు…! రాబోయే రెండ్రోజుల వర్షబీభత్సనానికి.. నిన్నా-ఇవాళ కురిసిన వర్షాలే చిన్న శాంపిల్‌ అన్న సంకేతాలిచ్చాడు వరుణుడు రాగల 48 గంటలు వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాలంటూ వార్నింగ్‌ బెల్స్‌ మోగిస్తున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాలు, బంగ్లాదేశ్ ప్రాంతాలలో ఏర్పడిన వాయుగుండం గత 3 గంటల్లో గంటకు 13 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, 0730-0830 గంటల మధ్య పశ్చిమ బెంగాల్ దాని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాలను …

Read More »

ఇప్పట్లో వానల్లేవ్‌.. ఆ జిల్లాలకు మాత్రం వరద ముప్పు! హెచ్చరికలు జారీ చేసిన సర్కార్..

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపించడం లేదు. అరకోర జల్లులు మినహా భారీ వానలకు అనుకూల వాతావరణం కానరావడం లేదు. మరోవైపు ఆగ్నేయ దిక్కులో ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి జార్ఖండ్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 15 వరకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు …

Read More »

మోస్తరు వానలతో సరిపెడుతున్న వరుణుడు.. ఇప్పట్లో భారీ వర్షాలు లేనట్లే!

రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో భారీ వర్షాల జాడ కనిపించడం లేదు. భారీ వర్షాల కోసం మరో రెండు వారాలు ఎదురుచూడాలని అంచనా వేసినట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఉత్తరాదిన వర్షాలు ఊపేస్తుంటే.. దక్షిణాదిన మాత్రం బలమైన ఈదురుగాలులతో సరిపెట్టుకుంటుంది.. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఛత్తీస్గడ్, మీదుగా దక్షిణ జార్ఖండ్ ప్రాంతంలోని అల్పపీడనం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ఉత్తర చత్తీస్గడ్ మీదుగా విదర్భ …

Read More »

అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం – ఏపీలో వానలే వానలు

అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం వల్ల ఉరుములు, బలమైన గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రమంతటా ఉంటాయని వివరించింది. గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు జూలై 07న ఉదయం 0830 గంటలకు నైరుతి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, దాని పరిసర ప్రాంతాలకు విస్తరించింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తువరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది …

Read More »

బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇదిగో

వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య అరేబియా సముద్రం నుండి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉండటం దీనికి కారణం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఈశాన్య అరేబియా సముద్రం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు ఉత్తర గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరంలోని ఉత్తర ప్రాంతాలు మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మీదుగా …

Read More »