యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో 188 మందితో జల యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. యోగా శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి సూచనలతో నీటిపై తేలియాడుతూ ప్లవని ప్రక్రియతో వృక్షాసనం, శవాసనం, పద్మాసనం, వాయుదిగ్బంధనం తదితర ఆసనాలతో విన్యాసాలు చేస్తూ అబ్బురపరిచారు. అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ (అవారా) ఆధ్వర్యంలో రింగ్ సాయంతో చిన్నారుల ఆసనాలు, నాగాయలంక ఈత మిత్రులు, బావదేవరపల్లి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఊపిరిని నియంత్రిస్తూ నీటిలో వివిధ …
Read More »