అంతేకాకుండా టీలో అధిక మొత్తంలో కెఫిన్ ఉండటం వల్ల పిల్లలు ఎక్కువగా మూత్రవిసర్జన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీ ఇవ్వకపోవడమే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పిల్లల నిద్రపై టీ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేవడం వంటి సమస్యలు వస్తాయి. సరిగా నిద్రపోయే పిల్లల్లోనే శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. పిల్లలకు టీ ఇవ్వడం వల్ల వారి నిద్రపై ప్రభావం పడి వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. చిన్న పిల్లలు టీ తాగడం వల్ల వారికి దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు టీ ఇవ్వడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది.
