మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నాడనీ.. టీచర్‌ను కత్తితో పొడిచిన స్టూడెంట్‌!

క్లాస్ రూంలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని టీచర్లు ఎన్ని సార్లు చెప్పినా కొందరు విద్యార్ధులు తరచూ వాటిని తీసుకురావడం ఆ కాలేజీలో షరా మామూలైంది. దీంతో ఓ టీచర్ విద్యార్ధులందరినీ వెతికి వారి వద్ద నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఫోన్లు లాక్కున్న టీచర్ పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కొందరు విద్యార్ధులు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో ..

కాలేజీకి మొబైల్‌ ఫోన్లు తెచ్చిన విద్యార్థుల నుంచి ఓ టీచర్‌ వాటిని స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఆగ్రహంలో ఊగిపోయిన ఇంటర్‌ విద్యార్థి టీచర్‌పై పగబట్టాడు. అప్పటినుంచి జేబులో కత్తి పెట్టుకుని అదును కోసం వేచిచూశాడు. సరిగ్గా మూడు రోజుల తర్వాత కత్తితో ఆ టీచర్‌ను పొడిచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని మిహిన్‌పూర్వా వద్ద ఉన్న నవయుగ్ ఇంటర్ కాలేజీలోకి మొబైల్‌ ఫోన్లు నిషేధం. అయితే మూడు రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్‌ రాజేంద్రప్రసాద్‌ క్లాస్‌లో విద్యార్థులను చెక్‌ చేశాడు. మొబైల్‌ ఫోన్లు తెచ్చిన వారి నుంచి వాటిని లాక్కున్నాడు. ఆ తర్వాత కాలేజీ సమయం ముగిశాక ఆ మొబైల్‌ ఫోన్లను ఆ విద్యార్థులకు తిరిగి ఇచ్చేశాడు. కానీ ఓ విద్యార్ధి మాత్రం ఈ ఘటనను అంతటితో మర్చిపోకుండా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

About Kadam

Check Also

టెట్ అభ్యర్ధులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ

టెట్ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో గ్రాడ్యుయేట్ టీచర్లు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *