నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు.. ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ కేంద్రం ప్రకారం.. ద్రోణి ఇప్పుడు ఈశాన్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ బెంగాల్‌లోని గంగానది, దాని పరిసర ప్రాంతాల మీదుగా అల్పపీడన ప్రాంతంతో అనుబంధము ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు. దక్షిణ గుజరాత్ ప్రాంతం, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ నుండి 7.6 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ – యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-
మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-
మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
తెలంగాణలో భారీ వర్షాలు..
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా.. గంటకు 40 నుండి 50 కిమీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.