దుమ్ము దుమారమే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. మొత్తం ఎన్ని రోజులంటే..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. కాళేశ్వరం రిపోర్ట్ ఆధారంగా బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది అధికార పార్టీ. కాళేశ్వరంపై ప్రభుత్వం కుట్రలను సభ సాక్షిగా తిప్పికొడతామంటోంది బీఆర్ఎస్‌. మరోవైపు కాంగ్రెస్‌ వైఫల్యాలను, బీఆర్ఎస్‌ అవినీతిని అసెంబ్లీలో కడిగేస్తామంటోంది బీజేపీ.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకున్నాయి. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సభలో ప్రవేశపెట్టి బీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరిస్తామంటోంది ప్రభుత్వం. నివేదికపై సుదీర్ఘంగా చర్చించి బీఆర్ఎస్‌ను కేసీఆర్, హరీష్‌రావును దోషులుగా నిలబెట్టాలని భావిస్తోంది.

కాళేశ్వరం నివేదికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పన, యూరియా కొరత, ఓట్‌ చోరీ అంశాలపై బీజేపీని కార్నర్ చేసేందుకు స్కెచ్‌ గీసింది అధికార పార్టీ. రిజర్వేషన్లపై ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే కీలక ప్రకటన చేసే అవకాశముంది.

మరోవైపు ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన 665 పేజీల రిపోర్ట్‌ను సభలో ప్రవేశపెట్టాకే చర్చ మొదలుపెట్టాలని డిమాండ్‌ చేస్తోంది బీఆర్ఎస్. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు అనుమతించాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరింది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ వేదికగా కాళేశ్వరంపై జరుగుతున్న కుట్రలను ప్రజలకు వివరిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు..

అప్పుల అంశంతో పాటు ఎరువులపైనా ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఎరువుల కొరతకు ప్రభుత్వ అసమర్థతే కారణమన్న విషయాన్ని సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు హరీష్‌ రావు.

అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ తెలంగాణ చీఫ్ రాంచందర్ రావు. కాంగ్రెస్ ఆరుగ్యారంటీలపై నిలదీయాలన్నారు. కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయనున్నారు బీజేపీ నేతలు. ముస్లిం రిజర్వేషన్‌ తొలగించి బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సభలో పట్టుబడతామన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు..

ప్రజా సమస్యలు, ఎన్నికల హామీలపై చర్చించేందుకు 10 రోజులపైనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తామంటున్నాయి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు.. అయితే.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

About Kadam

Check Also

సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌.. సెప్టెంబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *