తెలంగాణ ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలు వచ్చేశాయ్.. కాలేజీ వారీగా పూర్తి లిస్ట్‌ ఇదే!

తెలంగాణ ఈఏపీసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆదివారం సాయంత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు, వాటిల్లో భర్తీ చేసే సీట్ల వివరాలను వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 171 ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయని, వీటిల్లో 1,07,218 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. వీటిల్లో కన్వీనర్‌ కోటా కింద దాదాపు 70 శాతం సీట్లు అంటే 76,795 సీట్లు భర్తీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రత్యేక జాబితాను విడుదల చేసింది.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు జులై 8వ తేదీ ఆఖరి గడువు అని తెలిపింది. ఇప్పటికే అడ్మిషన్ల కోసం 95,654 మంది ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకున్నట్లు తెలంగాణ సాంకేతిక విద్య కమిషనర్‌, టీజీ ఈఏపీసెట్‌ కన్వీనర్‌ ఎ. శ్రీదేవసేన తెలిపారు. 76,494 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైనట్లు వెల్లడించారు. మరోవైపు ఆదివారం సాయంత్రం ప్రారంభమైన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జులై 10 వరకు కొనసాగనుంది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ కు సంబంధించి కన్వీనర్‌ కోటాలో బ్రాంచ్‌ల వారీగా అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

నేడే తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల.. ఎన్ని గంటల కంటే?

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌ 2025) ఫలితాలు సోమవారం (జులై 7) విడుదల కానున్నాయి. ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఐసెట్‌ పరీక్ష ప్రాథమిక కీ జూన్‌లో విడుదల చేయగా.. జూన్‌ 26 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. దీనిపై తుది కీ రూపొందించిన ఉన్నత విద్యా మండలి ఈ మేరకు ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *